సూర్య తాపపు అలెర్జీ 11620...India
46 ఏళ్ల మహిళకు2009 అక్టోబర్ లో తనకు వచ్చిన హెర్పస్వ్యాధి నయమైన తరువాత ఆమె ముఖం మీద దురద రావడం ప్రారంభమైంది. నెల తర్వాత దురద తీవ్రమైఆమె కొన్ని గంటలు బయటకు వెళితే సూర్య తాపానికి వాపు కూడా వస్తోంది. అప్పటినుండీ ఆమె కొంచం సేపు ఎండకు గురైనా దురద మరియు వాపు ఈ రెండింటితో ఆమె బాధ పడసాగారు. ఇది ఆమె చర్మాన్ని నల్లగా మార్చేసింది.దీని నిమిత్తం ఆయుర్వేద చికిత్స తీసుకున్నా అది ఏమాత్రం సహాయం చేయలేదు. 2010 జనవరిలో బైయాప్సీ రిపోర్టు సూర్య తాపపు ఎలర్జీ కారణంగా ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడించింది. ఆమెకు ట్యాబ్లెట్లు మరియు స్టెరాయిడ్ క్రీములు కూడాసూచించి పూర్తి రక్షణ లేకుండా బయటకు అడుగు పెట్టవద్దని డాక్టర్లు తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యాధికి చికిత్స లేదని కాబట్టి జీవితమంతా స్టెరాయిడ్లు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యుడు సూచించారు. ఈ మందులు ఆమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చినప్పటికీ వేరే మార్గం లేక 2019 మార్చి వరకువీటిని కొనసాగించారు. కాలం గడిచేకొద్దీ ఆమె పరిస్థితి మరింత దిగజారి వాపు సంభవించినప్పుడు ఆమె కళ్ళు కూడా తెరవలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆమె చేతులపైన చర్మం పలచగామారి పైన పొర ఉడిపోవడం ప్రారంభించింది. 2020 ఫిబ్రవరి 9న ఆమె వైబ్రియానిక్స్ చికిత్సను ఎంచుకోగా ప్రాక్టీషనర్ఆమెకు క్రిందిరెమిడీ ఇచ్చారు:
#1. CC8.1 Female tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies…TDSనీటిలో
రెండు నెలల్లోనే దురద యొక్క తీవ్రత 60% తగ్గిందిమరియు మరో నెలలో ఏప్రిల్ 26నాటికి ఆమెకు దురదతో పాటు వాపులో 100% మెరుగుదల కనిపించింది. వేసవికాలం సమీపిస్తున్నందున వలన రోగి TDSవద్దరెమిడీ కొనసాగించడానికి ఇష్టపడ్డారు. జూన్ 6న చర్మము యొక్క అసలు రంగు పునరుద్ధరించడానికి మరియుఅంతర్లీనంగా చర్మ సంక్రమణ (ఇన్ఫెక్షన్)ఏదైనా ఉంటే తొలగించడానికి ప్రాక్టీషనర్ రెమిడీని క్రింది విధంగా మెరుగుపరిచారు:
#2. CC21.2 Skin infections + #1…TDS
జూలై 5న#2నుODకి మరియు క్రమంగా రెండు నెలలలో OWకు తగ్గించి సెప్టెంబర్ 6 న నిలిపివేయడం జరిగింది. ఆమె చర్మం రంగు సాధారణమైనందుకురోగి చాలా సంతోషించారు, 2020 డిసెంబర్ నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు.
పేషంటు సాక్ష్యము:
సూర్య తాపపుఎలర్జీ కారణంగా నా ముఖం మీద చర్మముపై భయంకరమైన దురద మరియు వాపు ఏర్పడినల్లగా కమిలి పోవడంతో బయటకు వెళ్ళి ఎవరినైనా కలవడానికి సిగ్గుపడేదానిని. దీనికి చికిత్స లేదు జీవిత కాలంస్టెరాయిడ్ క్రీములు కొనసాగించాలని డాక్టర్ తెలిపారు.ప్రతీ సంవత్సరం గణేష్ చతుర్థి నాటికి చర్మంపై దురదలు ఎదుర్కొంటూనే ఉన్నాను(బహుశా పూల వలన కావచ్చు). కానీ ఈ సంవత్సరం నేను ఎటువంటి చర్మ సమస్యలు లేకుండా సంతోషంగా పండుగను జరుపుకున్నాను. ఇటువంటి అద్భుతమైన రెమిడీ ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలుతెలుపుకుంటున్నాను.