గొంతులో గడ్డ 11529...India
78-ఏళ్ల మహిళకు గత ఏడాది కాలంగా గొంతులో పొరబారుతూ ఉన్న లక్షణంతో బాధ పడుతున్నారు. పరిస్థితి క్రమంగా మరింత దిగజారి బొంగురు గొంతు మరియు దుర్బలమైన గొంతుకు దారి తీసింది. తత్ఫలితంగా ఆమె మాట్లాడలేకపోవడం,తను ఇష్టపడి చేసే రోజువారీ ప్రార్థనలను చేయలేకపోవడం జరుగుతోంది. వైద్య పరీక్ష చేయించగా ఆమె గొంతులో గడ్డ కలిగి ఉన్నట్లు రిపోర్టు తెలియజేసింది. వైద్యుడు శస్త్ర చికిత్స ద్వారా దానిని తొలగింపచేయాలని సూచించారు. అయితే ఆమె తన గొంతును కోల్పోయే ప్రమాదం 50% ఉందని కూడా హెచ్చరించారు. అందుకు భయపడిన రోగి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక తన విధిఎలా ఉంటే అలా జరుగుతుందని ఊరుకున్నారు. ప్రాక్టిషనర్ రోగి కుమార్తెకు స్నేహితురాలుకావడంతో వైబ్రో రెమిడీలు తీసుకోవలసిందిగాసూచించగా రోగి వెంటనే ఒప్పుకున్నారు. 2017మార్చి 18న ఆమెకు క్రిందిరెమిడి ఇవ్వబడింది:
#1. CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC19.7 Throat chronic...6TD
మూడు వారాల తర్వాత ఏప్రిల్ 8న రోగితనకు పొరబారటం మరియు గొంతు బొంగురు 50% తగ్గిందని మరియు పది నిమిషాలు సులభంగా మాట్లాడగలుగుతున్నానని తెలిపారు. #1నికొనసాగించాలని ఆమెకు సూచింపబడింది. అప్పటినుండి నెమ్మదిగా స్థిరమైన అభివృద్ధి కలిగి ఎనిమిది నెలల అనంతరం డిసెంబర్ 16న ఆమె 80% మెరుగుదల ఉన్నట్లు మరియు సులువుగా 40 నిమిషాల వరకు మాట్లాడగలుగుతున్నట్లు తెలిపారు. కాబట్టి మోతాదు QDS కి తగ్గించారు. అలాగే ఆమెకు దవడ నొప్పి ప్రారంభం కావడంతో కొంబోక్రింది విధంగా మెరుగుపరచబడినది:
# 2. CC11.6 Tooth infections + #1...QDS
మరో రెండు నెలల తర్వాత 2018 ఫిబ్రవరి 17న దవడ నొప్పి పూర్తిగా పోయి ఆమె స్వరం సాధారణ స్థితికి రావడంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె ఇప్పుడు తన రోజు వారి ప్రార్థనలను సులభంగా చేయగలుగుతున్నారు. వైబ్రో రెమిడీ ప్రారంభించిన తర్వాత ఆమె ఎప్పుడూడాక్టరును సంప్రదించలేదు. మోతాదు TDSకి తగ్గించబడిక్రమంగా జూలై 31న ODకి తగ్గించబడింది. డిసెంబర్ 2020నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు రోగిరెమిడీని ODకొనసాగిస్తూ సంతోషంగా ఉన్నారు.