సోరియాసిస్ 10767...India
64ఏళ్ల వ్యక్తికి రెండు కాళ్ళకు చీలమండల పైన చర్మం పొడిబారి దురద ఏర్పడింది. మరియు చర్మం కూడా నల్లగా మారిపోయి ఉంది. అతని వైద్యుడు దీనిని సోరియాసిస్అని నిర్ధారించగా రోగి సూచించిన మందులను రెండేళ్ల పాటు తీసుకున్నారు కానీ మెరుగుదల లేదు. 2019 మే 18న రోగి తన ఉంటున్నపట్టణ ప్రాంతంలో జరిగిన వైబ్రియానిక్స్శిబిరంలోప్రాక్టీషనరును సంప్రదించే అవకాశం లభించింది. అతనికి ఈ క్రింద రెమిడీ ఇవ్వబడింది:
CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies + CC21.10 Psoriasis...TDSకొబ్బరినూనెలో బాహ్య అనువర్తనం కోసం.రోగి అల్లోపతి చికిత్స తీసుకోవడం మానివేశారు.
నెల తర్వాత పేషెంటు తనకు దురద విషయంలో 70% ఉపశమనం ఉందని మరియు చర్మం క్రమంగా మృదువుగా మారి దాని సాధారణ రంగు లోకి తిరిగి వస్తున్నట్లు ఫోన్ ద్వారా తెలియజేశారు. అతనికి పోస్ట్ ద్వారా రీఫిల్ పంపబడింది. మరో నెల రోజుల తర్వాత తనకు కలిగిన ఉపశమనానికి సంతోషించిన వాడై స్వామికి మరియు ప్రాక్టీషనరుకు కృతజ్ఞతలు తెల్పడానికి సొంత ఊరు నుండి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెల్నెస్ క్లినిక్ కు రావడం జరిగింది. రెండు కాళ్లపై నల్లదనం మరియు విస్తృతి విషయంలో 80% తగ్గింపు ఉంది. రెండు నెలల తర్వాత సెప్టెంబర్ మధ్యలో అతనికి మరొక రీఫిల్ పంపబడింది. పూర్తిగా నయమైందని నివేదించడానికి రోగిని నవంబర్ ఆరంభంలో పిలిపించగా అప్పటినుండి మోతాదు మూడు వారాలపాటు BDకి అనంతరం ODకి తగ్గించాలని సూచించారు. జనవరి మూడో వారంలో చివరిసారి అతనికి ఫోన్ చేసినప్పుడు తను పూర్తిగా బాగానే ఉన్నానని 2020 జనవరి 8వ తేదీకి ఇచ్చిన గోళీలుపూర్తి అయ్యాయని తెలిపారు.