పునరావృతమవుతున్న మూలశంక (పైల్స్) 11615...India
50-ఏళ్ల మహిళకు గత మూడు వారాలుగా మలంలో రక్తము, అలాగే ఆసనము దగ్గరా మరియు కడుపులోనూ తీవ్రమైన నొప్పి కలగ సాగాయి. మొట్టమొదట 1996 లో రక్తస్రావం లేకుండా ఈ లక్షణాలు కనిపించగా ఇది మూలశంకగా నిర్ధారణ కావడంతో 15 రోజుల పాటు కొనసాగిన హోమియో చికిత్సతో వ్యాధి నయమయ్యింది. అదే లక్షణాలు 2017 జూన్ లో పునరావృతం అయ్యాయి. రోగి హోమియోపతి తిరిగి వాడారు. 2019 ఆగస్టు లో మూడవ సారి ఇది పునరావృతం అయింది. ఆమె మునుపటి హోమియోపతి డాక్టర్ ను సంప్రదించకుండా అల్లోపతి వైద్యుడిని సంప్రదించగా శస్త్రచికిత్స సూచించారు. అది ఇష్టంలేక ఆమె స్వయంగా తన వ్యాధికి హోమియోపతి నివారణలు ఆక్యులస్ (Aesculus) 200 తీసుకున్నారు కానీ ఇది ఏమాత్రం సహాయం చేయలేదు. 2019 ఆగస్టు 24న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింద రెమిడీ ఇచ్చారు:
#1. CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC8.1 Female tonic + CC15.1 Mental & Emotional tonic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 1 గంట వరకూ అనంతరం 6TD.
ఆగస్టు 26న కడుపునొప్పి విషయంలో కాస్త ఉపశమనం ఉన్నప్పటికీ రక్తస్రావం తగ్గకపోవడం మరియు ఆసన ప్రాంతం చాలా బాధాకరంగా ఉన్నందున ప్రాక్టీషనరు #1ని క్రింది విధంగా మెరుగు పరచడం జరిగింది:
#2. CC3.2 Bleeding disorders + CC20.4 Muscles & Supportive tissue + CC21.11 Wounds & Abrasions + #1…ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున ఒక గంట వరకు ఆ తర్వాత 6TD
రెండు రోజుల తర్వాత ఆమె నొప్పి 50% తగ్గినట్లు మరియు మలంలో రక్తంస్రావం లేదని తెలిపారు. సెప్టెంబర్ 2న ఆమె నొప్పి 90% తగ్గినందున మోతాదు TDS కు తగ్గించబడింది. సెప్టెంబర్ 20 నాటికి రోగి వ్యాధి లక్షణాలు అన్నింటినుండి విడుదల కావడంతో మోతాదు OD కి తగ్గించ బడింది. కానీ అక్టోబర్ 15న రోగి రెమిడీ ఆపాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 3న ఆమె ఇతర సమస్యలైన వెన్ను నొప్పి, మోకాలు నొప్పి, సాధారణ బలహీనత మరియు క్రమరహిత ఋతుస్రావం కోసం వచ్చారు. ఆమె రుతువిరతి దగ్గరగా ఉందని గుర్తించి #2 ను ముందస్తుగా ఆపి దీని స్థానంలో క్రింది రెమిడి ఇచ్చారు:
#3. CC3.2 Bleeding disorders + CC4.4 Constipation + CC8.6 Menopause + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS
16 రోజుల్లో ఆమె రోగ లక్షణాలు అన్నీ కనుమరుగయ్యాయి కాబట్టి నవంబర్ 19న #3 యొక్క మోతాదు OD కి అనంతరం డిసెంబర్ 4 నాటికి క్రమంగా 2TW కి తగ్గించబడింది. రెండు రోజుల తర్వాత ఆ ప్రాంతంలో నొప్పి పునరావృతం అయింది కాబట్టి తిరిగి మోతాదు TDS కి పెంచారు. ఆమెకు మరల నొప్పి లేకుండా పూర్తిగా తగ్గిపోవడానికి ఒక వారం పట్టింది. లక్షణాలు ఏవి పునరావృతం కాలేదని ఒక నెల పాటు భరోసా ఇచ్చిన తర్వాత 2020 జనవరి 14న OD కి తగ్గించారు ఆ తర్వాత ఐదు వారాల పాటు నిర్వహణ మోతాదు OW. కి తగ్గించారు 2020 ఫిబ్రవరి 17 న #3 ను OW వద్ద కొనసాగిస్తూ ఆమెకు CC15.1 Mental & Emotional tonic…TDS గా నెల వరకూ అనంతరం CC12.1 Adult tonic + CC17.2 Cleansing కు మార్చుతూ మరొక నెల ఇలా సంవత్సరం కొనసాగించ బడింది. 2017 అక్టోబర్ నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు.