Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఆందోళన రుగ్మత 03576...UK


2019 మార్చి 15న 48 ఏళ్ల వ్యక్తి తనకు ఏదైనా సహాయం చేయగలరా అని అడగడానికి ప్రాక్టీషనరును సంప్రదించారు. గత ఆరు నెలలుగా అతను తీవ్రమైన ఆందోళన, అలసట మరియు మానసిక అస్థిరత్వముతో బాధపడుతున్నారు. రక్త పరీక్షలు అతని TSH స్థాయి 6.8 mIU/L (సాధారణ స్థాయి 0.4నుండి 4.0) ఉన్నట్లు  వెల్లడయింది. ఇది భవిష్యత్తులో హైపో థైరాయిడిజంకు దారితీస్తుందని డాక్టరు చెపుతూ మందులేవీ ఇవ్వలేదు కానీ ప్రతి సంవత్సరం థైరాయిడ్ పనితీరు పర్యవేక్షించాలని కోరారు.. 

 ఒక వారం తర్వాత అతను ప్రాక్టీషనరును సందర్శించి కొన్ని సమయాల్లో అతను చాలా ఆందోళనతో లోపల మనసులో శూన్యత కలిగి ఉన్నట్లుగా చెప్పారు. తనలో ఆత్మ విశ్వాసం లోపించి మునుపటిలాగా ప్రజలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేకుండా ఉన్నట్లు చెప్పారు. భౌతిక స్థాయిలో చూచినట్లైతే అతనికి అన్నీ ఉన్నాయి. ప్రేమగా చూసే కుటుంబము, విజయవంతముగా నడుస్తున్న వ్యాపారము, విలాసవంతమైన జీవన శైలి కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు అతను ఆతృతగా, ఆందోళనగా, చంచలంగా, చిరాకుగా ఉండడంతో ఇది అతని దినచర్యను, అతని సామాజిక మరియు వృత్తి పరమైన జీవితాన్ని ప్రభావితం చేసింది. జీవితంలో ఇట్టి మానసిక స్థితిని ఎప్పుడూ అనుభవించలేదు. 3 సంవత్సరాల  క్రితం అతని చెల్లెలు 40 ఏళ్ల వయసులో పెళ్లికి ముందు రోజు మరణించడం కూడా అతన్ని ప్రభావితం చేయలేదు కానీ ఇప్పుడు తనను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన మానసిక భావోద్వేగ మరియు శారీరక మార్పులు అర్థం చేసుకోలేక పోతున్నట్లు ఈ పరిస్థితి తన వ్యాపారాన్ని దెబ్బ తీస్తుందేమో అనే ఆందోళనతో పెరిగిందని ప్రాక్టీషనరుకు చెప్పారు. అయితే రోగి తన సోదరి మరణానికి సంబంధించి కొన్ని పరిష్కరించని సమస్యలు ఉన్నాయని ప్రాక్టీషనర్ కనుగొన్నారు. ఆరు నెలల క్రితం వరకు అతను ఎటువంటి లక్షణాలు అనుభవించినప్పటికీ ఇది అతని మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. అతను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు తప్ప మరేమీ తీసుకోవాదం లేదు. 2019 మార్చి 23న అతనికి క్రింది రెమిడీ  ఇవ్వబడింది:
CC6.2 Hypothyroid + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders…TDS

మూడు రోజులు తర్వాత రోగి తన మానసిక స్థితిలో 60% మెరుగుదల ఉందని భావించారు. ఏప్రిల్ 10న మరో రెండు వారాల తర్వాత కుటుంబ సందర్భంగా అతను 90% మెరుగుదల ఉన్నట్లు తెలిపారు. తన లక్షణాలు మొదలయ్యే ముందు తాను ఎలా ఉన్నాడో అట్టి స్థితికి చేరుకున్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు. మరొక వారం తర్వాత ఏప్రిల్ 19న అతను పూర్తిగా కోలుకుని తన సాధారణ వృత్తి మరియు సామాజిక జీవితాన్ని కొనసాగించగలుగుతున్నట్లు ఆనందంగా తెలిపారు. మే 17న మోతాదు BD కి తగ్గించబడింది మరియు జూలై మధ్య భాగం నాటికి క్రమంగా తగ్గిస్తూ పూర్తిగా ఆపివేసారు. 2019 జూలై 2019 న అతని TSHస్థాయి 4mIU/L ఉండటంతో అతని వైద్యుడు ఇది ఆమోదయోగ్యమైనదిగా భావిస్తూ ఇది పునరుద్ధరించబడిన థైరాయిడ్ పనితీరుకు నిదర్శనం అని తెలిపారు. 2020 సెప్టెంబర్ నాటికి రోగి పూర్తిగా కోరుకుని ఉత్సాహంగా ఉన్నారు.