గుండె కు సంబంధించిన అత్యవసర స్థితి 11220...India
గుండెజబ్బు మరియు మధుమేహ వ్యాధి పీడితుడైన, 61 సంవత్సరాల చికిత్సానిపుణుడి మామగారు, 2013 మార్చి31న అర్ధరాత్రి అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. అతనికి వెంటనే CC3.4 Heart emergencies నీటిలో కలిపి ఇవ్వబడింది. ఇది తీసుకున్న రెండు నిమిషాల్లో, అతను లేచి మంచం మీద కూర్చోగలిగారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళుతూ ఐదు నిమిషాలకు ఒకసారి చొప్పున మోతాదు ఇస్తూ కారులో కూడా రెమిడీ కొనసాగించారు. ఆ తరువాత కూడా మరికొన్నిమోతాదులు తీసుకున్నారు. వీరు ఆస్పత్రికి చేరేసరికి అతనికి ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా ఉన్నారు. అతనిని గుండె జబ్బు, రక్తపోటు, మరియు అనుమానాస్పద స్ట్రోక్ నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అధిక రక్తపోటు మరియు రక్తంలో అధిక చక్కెర నిల్వలు కారణంగా మూర్చ వచ్చిందని వైద్యుడు కుటుంబ సభ్యులకు తెలిపారు. రోగి ఈ రెమిడీ ద్వారా ప్రయోజనం పొందిన ఇతర సందర్భాలు కూడా ఉన్నాయని అభ్యాసకుడు తెలియజేశారు.
ఈ కోంబో, గుండె జబ్బు మరియు ముఖ్యంగా మధుమేహం కూడా ఉన్నటువంటి రోగి కుటుంబ సభ్యులు గుండెకి సంబందించిన అత్యవసర స్తితిని ఎదురుకొనుటకు ఎల్లప్పుడూ దగ్గర ఉంచాలి అనడానికి ఒక నిదర్శనం. అటువంటి అత్యవసర పరిస్థితిలో ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది.