Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

కుడి వైపు నొప్పి మరియు శ్వాస సంబంధమైన అలెర్జీ 11597...India


40 ఏళ్ల మహిళ భుజం నుండి పాదం వరకూ కుడివైపున నొప్పితో నాలుగు నెలలుగా బాధపడుతున్నారు నొప్పి ఆమె నిద్రకు భంగం కలిగిస్తున్నది. ఎముకల డాక్టర్ నొప్పి నివారణ మందులు ఇచ్చారు కానీ ఇది ఉదయం పూట మగతకు కారణమవుతున్నందువలన ఆమె ఇంటి పనులను నిర్వర్తించు కొనుటకు ఆటంకం కలుగుతున్నది. మొత్తంమీద ఆమె ఈ చికిత్సను మూడు నెలల కొనసాగించినా ఏ ప్రయోజనం కలగలేదు. కనుక కొన్ని గృహ చిట్కాలతో నొప్పిని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ఇవి కూడా ఆమెకు సహాయపడలేదు కనుక 2018 మార్చి3న ప్రాక్టీషనరును సంప్రదించగా ఆమెకు క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:

పోడుస్తున్నట్లు ఉండే నొప్పి: 
#1. CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.5 Spine…TDS

నిద్రా భంగం:
#2. CC15.6 Sleep disorders...నిద్రకు ముందు అవసరమైతే ప్రతీ 10 నిమిషాలకు పునరావృతం చేయాలి.  

మార్చి 9న రోగి తన కుడి చెయ్యి మరియు భుజం నొప్పి విషయంలో 70% కోలుకున్నట్లు తెలిపారు కానీ కుడి కాలు నొప్పి కొనసాగుతూనే ఉంది. తుంటి ప్రాంతం చుట్టూ కొంత నొప్పి మరియు తిమ్మిరి కొనసాగింది. పుల్లౌట్ విషయాన్ని ప్రస్తావిస్తూ అటువంటి లక్షణాలు రెమిడీలు బాగా పనిచేస్తున్నాయని తెలపడానికి సంకేతంగా తీసుకోవాలని ప్రాక్టీషనర్ తెలిపారు. వీరి ప్రోత్సాహంతో రోగి రెమిడీలు కొనసాగించడానికి నిర్ణయించు కున్నారు. వారం తర్వాత మార్చి 17న ఆమె తనకు బాగా నిద్ర పడుతున్నట్లు, తిమ్మిరి కూడా పోయిందని కానీ నొప్పివిషయంలో ఉపశమనం స్వల్పంగానే ఉందని తెలిపారు. దాని కారణంగా #1 ని క్రింది విధంగా మెరుగుపరిచారు:   
#3. CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis + #1…TDS

ఒక వారం తర్వాత మార్చి 25న #2 నిలిపివేయబడింది. 5 వారాల తర్వాత ఏప్రిల్ 25న రోగి నొప్పి నుండి 100% కోలుకున్నట్లు తెలిపారు. 2018 మే 5 తరువాత కూడా నొప్పి కలగక పోవడంతో మోతాదును నెలరోజులకు OD తర్వాత మరో నెల వరకు OW కి తగ్గించారు. ఆమెకు నొప్పి పునరావృతం కాలేదు.

ఐతే 2018 ఆగస్టు 9న ప్రాక్టీషనరును కలిసి వసంత ఋతువు ప్రారంభంలో ఆమె ఇంటిని శుభ్రపరిచిన కారణంగా మూడు రోజులు అధికంగా తుమ్ములు మరియు శ్వాస తీసుకోవడంలో అవరోధం కలిగింది. వాస్తవానికి ఇది ఎనిమిది సంవత్సరాల సమస్య కానీ మునుపటి సంప్రదింపుల సమయంలో రోగి ఈ విషయం ప్రస్తావించలేదు, ఎందుకంటే ఆమె యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్ లతో దీనిని తగ్గించుకో గలుగుతున్నారు. ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది :

#1. CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.4 Asthma attack…ప్రతీ పది నిమిషాలకి ఒక మాత్ర చొప్పున గంట వరకు, అవసరం మేరకు మరొక గంట పునరావృతం చేయడం అనంతరం 6TD

మరుసటి రోజు ఉదయం ఆమెను ఆనంద, ఆశ్చర్యాలకు గురిచేస్తూ ఆమెకు ఒక్కసారి కూడా తుమ్ములు రాలేదు. ఆగస్టు 25న రోగి తుమ్ముల విషయంలో 80% ఉపశమనం పొందినట్లు ఇప్పుడు మరింత తేలికగా ఊపిరి పీల్చుకో గలుగుతున్నట్లు తెలిపారు. కానీ ఛాతీలో రద్దీ ఇంకా స్వల్పంగా ఉంది. అక్టోబర్ 3న మోతాదు TDS కి తగ్గించబడింది.. 

అక్టోబర్ 14వ తేదీన రోగి తనకు రోగలక్షణాలు ఏమీ లేనట్టు ఆమె ప్రాక్టీ షనరుకు తెలిపారు. మోతాదు ODకి తగ్గించబడింది. 2018 నవంబర్ 5న రోగి తనకు అలర్జీ, తుమ్ములు, శ్వాసకోస సమస్యలు ఏవీ లేవని ఆమె తన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు.  ఆమె ఒక టెస్టిమోనియల్ కూడా ప్రాక్టీషనరుకు పంపారు.

2020 ఆగస్ట్ నాటికి ఆమె లక్షణాలు ఏమీ పునరావృతం కాలేదు.  

పేషంటు సాక్ష్యము: ప్రాక్టీషనర్లు అందరికీ వారు చేస్తున్న సేవకు నా హృదయపు లోతులనుండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. స్వామికి మరియు వైద్య చికిత్సకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గత ఎనిమిది నెలలుగా నమ్మశక్యం కానీ విధంగా నొప్పి నివారణ మందులు తీసుకోవటం మానివేసి నందుకు కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. ఇప్పుడు నేను  యాంటీ హిస్టమిన్ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల కోసం ఖెమిస్ట్ దగ్గరకి పరిగెత్తడం లేదు. ఇప్పుడు నా శారీరక వ్యవస్థ రసాయనిక మందులు లేని స్థితికి చేరడం అనేది నా  ఆలోచనలను తేలిక చేసింది. ధన్యవాదాలు, ధన్య వాదాలు!