Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

విరిగిన కాలి పైన వ్రణము 11483...India


22 సంవత్సరాల వ్యక్తికి జరిగిన ప్రమాదంలో ఎడమ కాలి క్రింది భాగము విరిగిపోయింది. అతనికి హాస్పిటల్ లో చికిత్స చేసి విరిగిన భాగంలో స్టీల్ రాడ్డు వేసారు. నాలుగు నెలల తర్వాత, కట్టు విప్పినప్పుడు అతనికి ఎముక ఇంకా అతుకు కోలేదని దానితో పాటు పుండు కూడా ఏర్పడిందని గుర్తించారు. పేషంటు  2013 జనవరి 6 వ తేదీన మెడికల్ క్యాంపుకు వెళ్ళినప్పుడు ఒక ఎముకల వైద్య నిపుణుడు, ఇతనికి కాలు 50% మాత్రమే తగ్గిందని అందుచేత శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుందని సూచించారు. ఆ తర్వాత ప్రాక్టీ షనర్ పేషంటు కు క్రింది రెమిడి ఇచ్చారు:

NM3 Bone I + NM20 injury + NM25 Shock + NM59 Pain + SM15 Circulation + SR264 Silicea 200C + SR271 Arnica 6C + SR293 Gunpowder + SR298 Lachesis 30C + SR325 Rescue + SR405 Ruta 6C + SR408 Secale corn…6TD ఒక వారం పాటు తరువాత TDS.

ఫిబ్రవరి 7వ తేదీన పేషంటు హాస్పిటల్ కి వెళ్లి చూపించు కొన్నప్పుడు ఇతనికి ఎముక పెరుగుతున్నట్లు గాయం మానుతున్నట్లు డాక్టర్ కనుగొని  సర్జెరీ ఇక అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. అలాగే రెగ్యులర్ గా గాయానికి డ్రెస్సింగ్ చేయించుకోమని సూచించారు. 3-4 రోజులలోనే అతను హాస్పిటల్ కి నడిచి వెళ్ళడం ప్రారంభించారు.                                             మూడు రోజుల తర్వాత ప్రాక్టీ షనర్  డ్రెస్సింగ్ మార్చడం కోసం వెళ్ళినప్పుడు గాయం పైన చర్మం పెరుగుతోంది కానీ ఒకచోట మాత్రం చీము పట్టి ఉన్నట్లు గుర్తించారు. కనుక NM16 Drawing ను పై కొమ్బోకు కలిపి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గాయం పూర్తిగా మానిపోయి పేషంటు పూర్తిగా కోలుకున్నారు. ఐతే రెమిడి మాత్రం తక్కువ మోతాదులో వాడుతూనే ఉన్నారు.