Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

లారింగైటిస్ (స్వరపేటిక వాపు) 11561...India


38 ఏళ్ల మహిళ తన గొంతు బొంగురు పోవడం మరియు నొప్పి సమస్యతో ప్రాక్టీషనరును సంప్రదించారు. ఆమె సంగీతంలో శిక్షణ ప్రారంభించిన తర్వాత 2011 చివరిలో మొదటిసారి ఈ లక్షణాలు కనిపించాయి. అప్పటి నుండి ఆమె గొంతు ఎక్కువ ఉపయోగించవలసి వచ్చినప్పుడు సమస్య పునరావృతం అవుతోంది. ఆమె ENT స్పెషలిస్ట్ లారింగోస్కొపీ  ద్వారా ఇది లారింగైటిస్ అని నిర్ధారించి దీనికోసం మందులు ఇచ్చి స్వరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని సూచించారు.  ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇవ్వడంతో గృహ నివారణలు కూడా కొన్ని నెలలు తీసుకున్నారు కానీ ప్రయోజనం లేదు. కాబట్టి ఆమె పాడడం ఇక అసాధ్యం అనిపించింది. 2015లో ఆమె ఆయుర్వేద వైద్యుని సంప్రదించగా ఆమెకు కొన్ని మందులు ఇచ్చి ఆహారంలో మార్పుచేసుకొని స్వరానికి పూర్తి విశ్రాంతి నివ్వాలని సూచిచారు. ఆమె ఈ ప్రోటోకాల్ ఎనిమిది నెలలు కొనసాగించారు. ఇవి ఆమెకు సహాయపడి గానం తిరిగి ప్రారంభించడం జరిగినప్పటికీ గొంతు బొంగురు పునరావృతం అవుతూనే ఉంది. ఆమె ఒక స్వర నిపుణుడి సూచనలు కూడా పాటించారు కానీ నివారణ పాక్షికంగానే ఉంది.  

 2017 అక్టోబర్ 16 న, ఆమె వైబ్రియానిక్స్ ఎంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమెకు రెండు రోజుల నుండి గొంతు  బొంగురు మరియు తీవ్రమైన గొంతు నొప్పి ఉన్నాయి. ఆమె పాడడానికి అవకాశం పరిమితం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక సంవత్సరం నుండి ఆకలి లేకపోవడం మరియు తన బిడ్డ అనారోగ్య సమస్య గురించి ఆత్రుతగా ఉన్నారు.   ప్రాక్టీషనరు ఆమెను విశ్రాంతిగా ఉండాలని టెన్షన్ ఉన్నప్పుడు నెమ్మదిగా నీరు చప్పరిస్తూ త్రాగాలని ఇంకా ప్రాణాయామం కూడా చెయ్యమని సూచిస్తూ ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:

#1. CC4.1 Digestion tonic + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.7 Throat chronic…6TD 

 వారం తర్వాత రోగికి గొంతు నొప్పిలో 10% మాత్రమే ఉపశమనం ఉంది.  2018 ఫిబ్రవరి 3న అనగా 16 వారాల తర్వాత ఆమె గొంతులో 50%మెరుగుదల, గొంతునొప్పిలో 70% ఉపశమనం కలిగాయి. పురోగతి నెమ్మదిగా ఉందని అనిపించడంతో ఆమె ఆరోగ్య చరిత్ర గురించి ప్రాక్టీషనరు అరా తీయగా ఆమె చిన్నప్పుడు తల స్నానం చేసినప్పుడల్లా  ఆమె తల బరువుగా ఉన్నట్లు అనిపించేదని మరియు చాతీలో అధిక కపం చేరేదని తెలుసుకున్నారు. అంతేగాక ఆమె ఆయుర్వేద డాక్టర్ ఆమెకు డస్ట్ఎలర్జీ, మరియు లాక్టోజ్ఎలర్జీ ఉన్న కారణంగా ఆమెకు యాసిడ్ రిఫ్లెక్స్ కలిగించి అది ఆమె గొంతు బొంగురుకు కారణం అవుతుందని తెలిపినట్లు ఆమె చెప్పడంతో రెమిడీ ఈ క్రింది విధంగా మార్చి ఇచ్చారు:

#2.CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infection chronic + CC19.5 Sinusitis + CC19.7 Throat chronic…6TD

 ఐదు వారాల తర్వాత ఆమె ఎంతో ఉల్లాసంగా కనిపిస్తూ గొంతు నొప్పి పూర్తిగా పోయిందని, గొంతు బొంగురు విషయంలోనూ,  ఆమ్లత్వం, ఆకలి లేకపోవడం విషయంలో 80% ఉపశమనం కలిగిందని తెలిపారు. 2018 ఏప్రిల్ 23 నాటికి ఆమె వ్యాధి లక్షణాల నుండి పూర్తిగా కోలుకోవడంతో మోతాదు TDS కి తగ్గించారు. తన సంగీత తరగతులు మరియు రంగస్థల ప్రదర్శనలు తిరిగి ప్రారంభించడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు.

2018 ఆగస్టు 8న ఆమె గంట నిడివి ఉన్న సంగీత కచేరి G# స్కేల్ లో హాయిగా ప్రదర్శించగలిగారు. ఆమె వైబ్రియానిక్స్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. 2019 జనవరిలో మోతాదు పూర్తిగా ఆపే ముందు ఐదు నెలలు క్రమంగా మోతాదును తగ్గించారు. 2019 ఫిబ్రవరి 27న ఆమెను CC12.1 Adult tonic నెలకు అనంతరం  CC17.2 Cleansing నెల తరువాత నెల మార్చుకుంటూ సంవత్సరం ఇచ్చారు. 2020 జూన్  నాటికిఆమెకు వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం  కాలేదు మరియు తన బిడ్డల చికిత్స కోసం ఆమె ప్రాక్టీషనరును సందర్శిస్తూనే ఉన్నారు.