Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

శ్వాసకు సంబంధించిన ఎలర్జీలు, అంగస్తంభన సమస్యలు 11964...India


31 ఏళ్ల వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా దాదాపు ఏడాది పొడవునా ముక్కు కారడం, తుమ్ములు, మరియు గొంతు నొప్పితో తరుచూ అలసటకు గురిఅవుతున్నారు. వాతావరణంలో మార్పుతో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అతను సిట్రజిన్ లేదా అల్లెగ్ర వంటి యాంటీ హిస్టమిన్లను వాడుతున్నప్పటికీ ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తున్నాయి. 2016 సెప్టెంబర్ 24న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:

#1. CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases...TDS

ఆ తర్వాత వెంటనే పేషంటు పని మీద దూరం వెళ్ళవలసి వచ్చింది. ఐదు నెలల తర్వాత అతడు తిరిగి వచ్చినప్పుడు తీవ్రమైన దగ్గు, ఛాతీలో వత్తిడి, సైనస్ వాపు మరియు అప్పుడప్పుడు వస్తున్న జ్వరం వంటి ఇటీవలే ఏర్పడిన సమస్యలతో ప్రాక్టీషనరును కలిశారు. తను ఊరిలో లేనప్పుడు #1వ రెమిడీ చాలా బాగా పనిచేయడంతో అతనికి 100% ఉపశమనం కలిగిందని అతను తెలిపారు. 2017 మార్చి 2న అతనికి శ్వాసకోశ ఎలర్జీకి కూడా రెమిడీ ఇవ్వాలని నిర్ణయించుకుని క్రింది రెమిడీ ఇచ్చారు:

#2. CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic...QDS

రెండు వారాల్లో రోగి పూర్తిగా కోలుకున్నారు కానీ పని ఒత్తిడి కారణంగా రెమిడీ మోతాదు తగ్గింపు విషయంలో నిర్లక్ష్యం వహించి రెమిడీ తీసుకోవడం మానివేశారు. ఫలితంగా రెండు నెలల తర్వాత జ్వరం మినహా అన్ని లక్షణాలు తిరిగి వచ్చాయి. మే 15న రెమిడీ తీసుకునే సందర్భంలో మోతాదు తగ్గింపు షెడ్యూల్ అనుసరించడము, జాగ్రత్తలు పాటించడం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఇచ్చిన సూచనలను పాటిస్తానని వాగ్దానం చేసిన మీదట అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

#3. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic...TDS 

పన్నెండు రోజుల తర్వాత 2017 మే 27 న తనకు 100% మెరుగయ్యిందని తెలిపారు. #3 యొక్క మోతాదు TDS వద్ద  కొనసాగించి ఆపడానికి ముందు తర్వాతి రెండు నెలలు క్రమంగా తగ్గించబడింది. అతనికి వ్యాధి లక్షణాలు తిరిగి రాలేదు. ఈ రెండింటి ద్వారా ప్రోత్సహించ బడిన ఇతను ఇతర సమస్యలైన అంగస్తంభన సమస్య,ఆలశ్యంగా స్కలనము, వీర్యంలో తగ్గుదల కోసం సహాయం కోరడానికి నిర్ణయించుకున్నారు. వివాహం ఐన రెండేళ్ల నుండికూడా అల్లోపతి, ఆయుర్వేదం, మరియు హోమియో చికిత్స తీసుకున్నా ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి. 2017 జూలై 27న నిస్సహాయంగానూ ఆందోళన తోనూ ఉన్న పేషంటుకు ప్రాక్టీషనరు క్రింది రెమిడీ ఇచ్చారు:   

#4. CC14.1 Male tonic + CC14.3 Male infertility + CC15.1 Mental & Emotional tonic...TDS

సెప్టెంబర్ 3న పేషంటు తనలో ఎటువంటి మార్పు లేదని తెలిపడంతో #4 స్థానంలో క్రింది రెమిడీ ఇవ్వబడింది:   

#5. CC17.2 Cleansing...TDS

మూడు వారాల తర్వాత సెప్టెంబర్ 23న అతను వత్తిడి విషయంలో కొంత మెరుగుదల ఉన్నప్పటికి మిగతా లక్షణాలలో వేరే మార్పేమీ లేదని తెలపడంతో ప్రాక్టీషనరు అతనికి మియాజమ్ తో చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు.  అతనికి క్రింది రెమిడీ ఒకే ఒక మోతాదు ఇచ్చారు:  

#6. SR249 Medorrhinum 1M

అక్టోబర్ 23న అనగా ఒక నెల తర్వాత రోగి 25% మెరుగుదల ఉందని తెలపడంతో కొంచం ఎక్కువ పోటెన్సీ 50M తో 2వ మోతాదు అనంతరం CM పోటెన్సీ తో నవంబర్ 22 న 3వ మోతాదు ఇచ్చారు. అప్పటికి 100% మెరుగుదల ఉండడంతో ఎంతో ఉత్సాహంతో ఆ జంట గోవాలో రెండవ హనీమూన్ జరుపుకున్నారు.

రోగి ప్రాక్టీషనర్ ను 2018 ఏప్రిల్ లో మాత్రమే కలిసే పరిస్థితి ఏర్పడింది. ఐతే అప్పటికే అతని భార్య 6 వారాల గర్భవతి. ఆమె 2018 డిసెంబర్ 31న ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.

2017 ఆగస్టు 19న యొక్క అతని 27 ఏళ్ల భార్య గత 10 సంవత్సరాలు మానకుండా వస్తున్న లో జ్వరము, కళ్ళలో వత్తిడి, తరుచుగా వచ్చే తలనొప్పి గురించి ప్రాక్టీషనరుకు చెప్పారు. ఆమె ఎంతో మంది వైద్యులకు చూపించుకొని CT స్కాన్ తో సహ ఎన్నో వైద్య  పరీక్షలు చేయించుకున్నా ప్రయోజనం లేకపోయింది. కనీసం ఆ పరీక్షలు రోగనిర్ధారణ కూడా చేయలేకపోయాయి. ప్రాక్టీషనరు వద్దకు వచ్చినప్పుడు ఆమె అన్ని ఔషధాలను నిలిపివేసి తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందనే వీరిని కలవగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC8.1 Female tonic + CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS

8 వారాల్లో ఆమె కళ్ళలోని భారంతో పాటు తలనొప్పి, జ్వరం కూడా మాయమయ్యాయి. 2017 డిసెంబర్లో రెమిడీ ఆపడానికి ముందు ఈ నాలుగు నెలల్లో మోతాదు క్రమంగా తగ్గించబడింది. ఆమెకు ఇప్పటివరకు ఏ వ్యాధి లక్షణములు లేవు.   

2018 ఆగస్టు 13న మగ పేషంటు నుండి వచ్చిన వ్యాఖ్య (వాక్యార్ధము గ్రహించ బడినది):  

వైబ్రియానిక్స్ వలన నాకు కలిగిన అద్భుతమైన అనుభవాలను వ్యక్తపరచాలి అనుకుంటున్నాను. వాతావరణ మార్పులకు మరియు అనేక ఇతర విషయాలకు నాకు అలర్జీలు ఉన్న కారణంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా   ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో దాదాపు ఏడాది పొడవునా బాధపడుతూ ఉండేవాడిని. నేను యాంటీబయాటిక్స్ అధిక మోతాదుతుతో సహా అలెర్జీ నివారణ వ్యాక్సిన్లను కూడా తీసుకున్నాను. అప్పుడే నేను వైబ్రియనిక్స్ ప్రాక్టీషనరు గురించి తెలుసుకున్నాను. అతని రెమిడీల ప్రభావం నాపై అద్భుతంగా పనిచేసి నేను చాలా వేగంగా కోలుకొనడమే కాక తిరిగి వ్యాధి లక్షణాలకు ప్రభావితం కాలేదు. అయినప్పటికీ ఈ గోళీలు ఎప్పుడూ చేతిలో  ఉంచుకుంటాను ఎందుకంటే నాకు గొంతులో ఏమాత్రం అసౌకర్యం అనిపించినా ఇవి నాకు ప్రతీసారి పనిచేస్తూనే ఉన్నాయి. నాకు చాలా కాలంగా ఉన్న అంగ స్తంభన సమస్యలు కొన్ని నెలల్లోనే పూర్తిగా మెరుగవ్వడంతో ఇప్పుడు నా భార్య ఆరు నెలల గర్భవతి. అలాగే ఆమెకు కూడా వ్యక్తిగతంగా దాదాపు 9-10 సంవత్సరాల నుంచి ఎల్లప్పుడు లో జ్వరము ~ (99-100F) సమస్య ఉంది. ఆమె చాలా మంది వైద్యులను సంప్రదించి CT స్కాన్ తోసహా అనేక పరీక్షలు చేయించుకున్నా వైద్యులు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. వైబ్రియానిక్స్ మిశ్రమాలు ఆమెను పూర్తిగా నయం చేశాయి.

అంకుల్ మరియు ఆంటీ... మీ నిస్వార్ధ సహాయమునకు నేను నిజంగా ఎంతో కృతజ్ఞతలు తెలపాలని భావిస్తున్నాను. మీరు నిజంగా మా జీవితాలనే కాక ఎంతో మంది జీవితలను అనేక రకాలుగా మార్చారు. జీవితలను రక్షించే ప్రక్రియలో  మీరు రాత్రి పగలు పని చేసస్తూ నయాపైసా ఖర్చు లేకుండా అద్భుతాలు సృష్టిస్తున్నారు. మీ ప్రభావవంతమైన విశ్లేషణ మరియు ఔషధాలకు ధన్యవాదాలు. ఇవి లేకపోతే నేను ఈ ఆనంద జీవితాన్ని కొనసాగించాలేక పోయే వాడిని.