కోవిడ్ -19 02799...UK
2020 మార్చి 12న 50 ఏళ్ల స్త్రీ కి చాలా తీవ్రమైన తలనొప్పి దానితో పాటు కంటి నొప్పి కనులవెంట నీరుకారడం, ప్రారంభ మయ్యింది. ఆ తర్వాత మూడు రోజుల్లో ఆమెకు ఈ లక్షణాలు మరింత అభివృద్ధి అయ్యి శారీరక నొప్పులు, స్వల్ప జ్వరం, పొడిదగ్గు, ఆకలి లేకపోవడం, రుచి మరియు వాసన కోల్పోవడం మరియు తీవ్రమైన అలసట ఏర్పడ్డాయి. చిన్నప్పటినుంచి ఆస్త్మా పేషంటు కావడం వలన ఆమెకు జలుబు మరియు దగ్గు తేలికగా వచ్చే అవకాశం ఉన్నందున ఆమె బ్రాంఖో డైలేటర్స్ పై ఆధారపడి ఉన్నారు. తనకు కోవిడ్-19 లక్షణాలు ఏర్పడినట్లు తెలుసుకుని దానికి చికిత్స లేదు కనుక ఆమె వైద్యుడిని సంప్రదించడానికి బదులుగా సోషల్ మీడియాలో సమాచారం అనుసరించి పారాసిట్మల్ ట్యాబ్లెట్ తీసుకుంది. ఇది జ్వరాన్ని తగ్గించింది. దీనితోపాటు నిమ్మరసంతో కూడిన వేడినీరు ప్రతీ ఉదయమూ మరియు ఆయుర్వేద దినుసులు మరియూ తేనెతో తయారు చేసిన టీ రోజంతా త్రాగుతూ ఉండేవారు. త్వరలోనే ఆమె భర్త ఇలాంటి లక్షణాలు చూపించడం ప్రారంభించాడు మరియు మార్చి16 న ఉష్ణోగ్రత 103F కు పెరిగినప్పుడు భయం మొదలైంది. ఆమె కఠినమైన అనుభూతిని పొందుతున్న స్థితిలో ఒక స్నేహితురాలు సూచన మేరకు ఆమె ప్రాక్టీషనర్కి ఫోన్ చేసారు. 24 గంటల్లోనే రెండు బాటిళ్ళను ఆమె గడప వద్దకు చేర్చడం జరిగింది.
కోవిడ్-19 నియంత్రణకు :
#1. CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…6TD
మంటకు :
#2.Prednisolone ను 10M & CM వద్ద పోటెన్టైజ్ చేసినది…QDS
2020 మార్చి 17న ఈ బాటిళ్లు చేరిన వెంటనే వాటిని వాడడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం నాటికి ప్రతీ లక్షణం విషయంలోనూ ఆమెకు చాలా మెరుగుగా అనిపించింది. మార్చి 24 నాటికి ఆమె లక్షణాలు దాదాపు మాయమవడంతో 80% మెరుగుగా ఉంది. ఐతే అప్పుడప్పుడు వచ్చే పొడి దగ్గు, కొద్దిగా తల నొప్పి మరియు అలసట మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐతే వాసన మరియు రుచి భావన మాత్రం ఆమెకు 2020 ఏప్రిల్ 5 నాటివరకూ పొందలేక పోయారు. ఏప్రిల్ 10 నాటికి ఆమె 100% మెరుగయ్యారు. #1 మరియు #2 మోతాదును TDSకు తగ్గించారు. మరో రెండు వారాలలో రెమిడీలు పూర్తిగా అయిపోయినవి.
పేషంటు వ్యాఖ్య: 24 గంటల్లో రెమిడీ బాటిళ్లను మాఇంటికి పంపిణీ చేయడంలో ఆమె చేసిన కృషికి, మరియు తక్షణ సాయమునకు మేము ఆమెకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
సంపాదకుని వ్యాఖ్య: కోవిడ్-19 అనంతర చికిత్స వ్యాధి ఆ ప్రాంతం నుండి అదృశ్యమయ్యే వరకూ ODగా కొనసాగించాలి.