Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ద్వైపాక్షిక ధృడతర స్నాయువుల వ్యాధి, మొటిమల రుగ్మత, ముఖముపై మంట 03508...France


47 ఏళ్ల మహిళ తన రెండు చేతులను తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పి మెడ నుండి మణికట్టు వరకు ఉంటోంది. 2011లో ఇది ద్వైపాక్షిక స్నాయువుల వ్యాధిగా నిర్ధారణ చేయబడింది. దీని నిమిత్తం ఆమెకు ప్యారాసిటమల్ మరియు ట్రమడాల్ మాత్రలు సూచించబడ్డాయి. 2014 డిసెంబర్ లో ఆమె రెండు మోకాళ్ళకు కూడా నొప్పి ఏర్పడింది. బహుశా ఎక్కువ గంటలు నిలబడి పనిచేయడం వలన కావచ్చు. 2015 ఫిబ్రవరి నాటికి పరిస్థితి మరింత దిగజారింది. ఆమె ఒకవైపుకు తిరిగి  పడుకోలేరు  అలాగే చేతులను కూడా పైకి ఎత్తలేరు. ఇది ఆమె శ్రమైక జీవితానికి సవాలుగా మారింది. దీని నిమిత్తం ఆమె డాక్టరు ఆమెకు ఇబుప్రొఫెన్ 400 mg BD గా మరియు కార్టిజోన్ 10mg OD గా తీసుకునేలా మాత్రలు ఇచ్చారు. మరియు ఫిజియోథెరపీ కూడా ప్రారంభించారు. ఆమె తగినంత ఉపశమనం లేకుండా 40 అల్ట్రాసౌండ్ చికిత్సలు చేయించుకున్నారు.

వీటికి అదనంగా ఆమె ముఖం మీద దురదతో కూడిన ఎర్రని పొక్కులు, పొలుసులు, చర్మపు మంట ఏర్పడ్డాయి. 2012లో మొటిమల రుగ్మత గా ఇది నిర్ధారింపబడింది. అప్పుడప్పుడు ఇవి వాస్తూ ఉండేవి. వీటి నిమిత్తం ఆమె కార్టిజోన్  క్రీమ్ మరియు క్యురేన్ 10mg మాత్ర OD గా  ఊపయోగించేవారు. మూడు సంవత్సరాల అల్లోపతి చికిత్స తీసుకున్నప్పటికీ ఎటువంటి మెరుగుదల లేదు.

 రోగికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తల్లిమరణం తో కలిగిన షాక్, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇలా ఆమె జీవితంలోని అన్ని వర్గాలనుండి దీర్ఘకాలిక ఒత్తిడితో కూడా బాధ పడుతోంది. దీని పరిష్కారానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించ నందున 2015 సెప్టెంబర్ 29న ఆమె ప్రాక్టీషనర్ని సందర్శించినప్పుడు ఆమె నిరాశ నుండి విముక్తురాలు కావడానికి మరియు సహాయం కోసం ఆశతో ఉన్నారు:

వత్తిడి మరియు మొటిమలకు :
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections…TDS

బాధాకరమైన స్నాయువుల రుగ్మతకు :
#2. CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles & Supportive tissue…QDS

ఆమె కు సూచించబడిన అల్లోపతీ మందులతోపాటు వైబ్రియానిక్స్ రెమిడీలు కూడా కొనసాగించారు. 2015 అక్టోబర్ 30న ఆమె ఒత్తిడి యాభై శాతం తగ్గినట్లు ఆంతరంగికంగా కొంత మెరుగుగా ఉన్నట్లు తెలిపారు. మొటిమల లక్షణాలలొ 40% ఉపశమనం పొందారు. 2015 నవంబర్ 26న ఆమె రేడియో మరియు ఎకోగ్రఫీ పరీక్షలు చేయించు కున్నప్పుడు గతంలో లేని  కీళ్ల కాల్సిఫికేషనును వెల్లడించింది. నాలుగు రోజుల తర్వాత నవంబర్ 30 న ఆమె మొటిమల స్థితిలో మాత్రమే కొంచెం మెరుగుదల తప్ప మరెక్కడా ఉపశమనం కలుగ లేదని తెలిపారు. దీనికి అదనంగా ఆమె ఊరికే అలిసిపోతున్నట్లు, మరియు నవంబర్ ప్రారంభం నుండి మెడనొప్పి ప్రారంభమైనట్లు తెలిపారు. ఆమెకు త్వరగా అలిసిపోవడం నుండి తగ్గించడానికి #1  క్రింది విధంగా మార్చబడింది:
#3. CC3.1 Heart tonic + #1…TDS

ఆమెకు కీళ్ల నొప్పి నుండి ఉపశమనానికి #2 క్రింది విధంగా మార్చ బడింది:  
#4. CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + #2…QDS; మరియు మెడ భుజాలు మరియు చేతులకు బాహ్య అనువర్తనం కోసం బాదం నూనెలో …BD గా ఇవ్వబడింది.

2016 ఫిబ్రవరి 5న ఆమె మెడ నొప్పి నుండి పూర్తిగా కోలుకోవడం మొటిమలకు సంబంధించిన లక్షణాలు 60% మెరుగుదల చేతులు మరియు మోకాళ్ళలో నొప్పి నుండి 70% మెరుగుదల మరియు ఆమె మానసిక స్థితిలో కూడా మెరుగుదల ఏర్పడినట్లు తెలిపారు. ఇప్పుడు ఆమె చేతులు ఎత్తగలరు కానీ పూర్తిగా కాదు కాబట్టి ఆమె ఫిజియోథెరపీ కూడా ప్రారంభించారు.

2016 ఏప్రిల్ 5న ఒక ఆసుపత్రిలో ఆపరేటింగ్ బ్లాకును శుభ్రపరిచే సాంకేతిక నిపుణులుగా పని చేసిన రోజు ప్రమాద వశాత్తూ సానిక్లేర్ అనే క్రిమిసంహారిణి ఆవిరులకు గురి అయ్యారు. ఫలితంగా ఆమె ముఖం చర్మంలో మొదటి డిగ్రీ కాలిన గాయాలు ఏర్పడి ఎర్రగా మారాయి. ఆమె దీని నిమిత్తం వైద్యుని సంప్రదించ లేదు, అలోపతి మందులు ఉపయోగించలేదు. 2016 ఏప్రిల్ 8 న #3 ఆపివేయబడింది మరియు ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

చర్మానికి :
#5. CC3.7 Circulation + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.4 Stings & Bites…TDS మరియు బాహ్యంగా చర్మం పై రాయడానికి బాదం నూనెలో…BD.

ఆమె మొటిమల కోసం కార్టీకోయిడ్ క్రీం వాడటం మానేసారు ఎందుకంటే ఇది మంటను తీవ్రతరం చేసింది.

మానసిక స్థిరత్వము మరియు శారీరక బలం కోసం :
#6. CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

స్నాయువుల రుగ్మత కీళ్ల కదలికలో మెరుగుదలకు, #4 ను క్రింది విధంగా మార్చడం జరిగింది:
#7. CC20.7 Fractures + #4…TDS

నెల రోజుల్లో ఆమెకు నొప్పుల్లో 90% మెరుగుదల ఏర్పడింది. ఆమె తన రెండు చేతులను సులభంగా పైకి ఎత్తగలుగుతున్నారు. ఆమె ఫిజియోథెరపిస్ట్ ఈ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయి చికిత్సను నిలిపివేశారు. వైబ్రో చికిత్స కొనసాగించ వలసిందిగా ఆమెను   ప్రోత్సహించారు. ఇప్పుడు ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు పడుకో గలుగుతున్నారు. ఆమె ముఖం మీద కాలిన గాయాలు మరియు మొటిమల్లో అలాగే వత్తిడి మరియు నిరాశ విషయంలోనూ 80%మెరుగుదల ఏర్పడింది. ఈ మూడు రెమిడీలు #5#6 మరియు  #7 మరో మూడు నెలల పాటు TDS గా కొనసాగించ బడ్డాయి. 2016 జులై 30 వ తేదీన ఆమె తన వ్యాధి లక్షణాలు అన్నింటిలో 100% మెరుగుదల ఏర్పడి పూర్తిగా నయమైనట్లు తెలిపారు.  #5, #6, #7 లను ఆపివేసి వీటి నుంచి ఎంచుకున్న కోంబోలతో కొత్త రెమిడీ #8 ఇవ్వబడింది:

#8. CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC21.2 Skin infections + CC21.3 Skin allergies…BD గా 3 నెలలు అనంతరం OD గా 2 నెలలు.

ఈ మధ్య కాలం లోనే అనగా 2016 సెప్టెంబర్ నుండి కార్టిజోన్ 10 mg మినహా అల్లోపతి మందులు అన్నింటినీ అలోపతి వైద్యులు నిలిపివేసారు. ఇది 2017 జనవరిలో మాత్రమే సున్నాకి తగ్గించబడింది. ఈ సమయంలోనే #8 యొక్క మోతాదు  OWకు తగ్గించ బడింది.

2019 మేలో జరిగిన ఒక సమీక్షలో ఆమె కీళ్ళుఅన్నీ బలంగా ఉన్నాయనీ మరియు ఆమె భారీ వస్తువులను సులభంగా ఎత్తగలుగుతున్నట్లు తెలిపారు. ఆమె ముఖము ప్రకాశవంతమై మరియు ఆమె ముఖ చర్మం మృదువుగా తయారు కాబడింది.  రోజు వారి ఆరోగ్యసాధనలో వైబ్రియానిక్స్  సమ్మిళితము చేయబడిన తరువాత ఆమె శరీరం మరియు మనసులో చాలా చక్కగా ఉన్నట్లు అనిపించింది. 2020 మార్చి నాటికి ఆమెకు ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదు ఆయినప్పటికీ #8…OW.గా కొనసాగిస్తున్నారు.

పేషంటు వ్యాఖ్య:
4 సంవత్సరాల క్రితం నా స్నాయువు సమస్యల గురించి నా సహోద్యోగికి చెప్పాను. నా చేతులు పైకి ఎత్తడం నాకు చాలా కష్టమైంది. ఇప్పుడు నొప్పి అంటే ఏమిటో తెలియని పరిస్థితి చేకూర్చి చేతులను సులువుగా ఉపయోగించే స్థితి కల్పించిన  వైబ్రియానిక్స్ రెమిడీలకు ధన్యవాదాలు. నా దూకుడు స్వభావం సర్దుకొని ఇప్పుడు నేను మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగు తున్నాను. నేను నిజంగా మంచి అనుభూతి పొందుతున్నాను. కాంబో ఇబ్బందికరంగా ఉన్న నా ముఖ తీరును మార్చివేసింది. సహనంతో శ్రద్ధతో ఎలా చేయాలో చెప్పిన మీకు ధన్యవాదాలు. నా చేతులను మళ్ళీ ఉపయోగించగలుగుతున్నకు ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉన్నాను. ఈ అన్నిటికి కారణభూతులైన మీకు ధన్యవాదాలు.