మస్తిష్క (సెరిబ్రల్) క్షీణత 02640...India
ఒక వైబ్రియో మొబైల్ వైద్య శిబిరానికి ఒక మహిళా తన 2½ సంవత్సరాల కుమారుడిని చేతిలో పట్టుకుని తీసుకువచ్చింది. ఎందువలనంటే అతను నడవలేడు, నిలబడలేడు మరియు అతని తల చాల పెద్దదిగా ఉండి, కనులు కూడా స్తిరంగా లేక చేతులను కూడా పైకేత్తలేక పోయేవాడు. చూడటానికి అ దృశ్యం చాల హృదయవిదారకంగా ఉంది. అందరి హృదయాలు అ బాలుడిని చూచి చలించిపోయాయి. అతనికి ఈ క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:
CC12.2 Child tonic + CC18.1 Brain disabilities + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis + CC20.5 Spine...QDS మూడు నెలల పాటు.
మూడు నెలల తరువాత జరిగిన వైద్య శిబిరంలో, ఆ బాలుని తల్లి యొక్క ప్రక్కింటావిడ ఆ బాలునిలో చాల మంచి మార్పు కనపడిందని చెప్పింది. అతనిప్పుడు నిలబడగలడు, కూర్చోగలడు, చేతులను కొద్దిగా పైకెత్తగలడు మరియు అతని చూపు కూడా స్థిరంగా ఉండి చక్కగా నవ్వగలుగుతున్నాడు. ఈ అధ్బుతమైన వార్త విని అందరు చాలా సంతోషించారు. అందరు ఇతనిలోని మంచి మార్పు ఇలాగే కొనసాగాలని స్వామిని ప్రార్ధించారు మరియు పై రెమేడిలను కొనసాగించటానికి అతనికి వైబ్రియో గోలీలు ఎక్కువగా ఇవ్వబడ్డాయి.
సంపాదకుని వ్యాఖ్యానం: మీరు సాయి రామ్ పోటెమ్ టైజర్ ఉపయోగించేవారైతే పై రెమిడీలకు బదులుగా ఇవి ఇవ్వవచ్చు: NM4 Brain + NM5 Brain TS + NM25 Shock + NM90 Nutrition + OM20 Paralysis Flaccid + OM21 Paralysis Spastic + SM12 Brain & Paralysis + SR356 Plumbum Met + SR458 Brain Whole + SR459 Brain (Broca’s Area) + SR460 Brain (Cerebellum) + SR461 Brain (Medulla) + SR462 Brain (Pons) + SR463 Cranial Nerves + SR532 Sympathetic Nervous System + SR546 Baryta Carb.