నోటి క్యాన్సరు 11975...India
2013 ఫిబ్రవరి లో 40 ఏళ్ల వ్యక్తికి నోటి క్యాన్సర్ మూడవ స్టేజి ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యి కీమోథెరపీ అనంతరం 2013 ఏప్రిల్ 24న శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ అతనికి క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో ఆరు నెలలు మించి బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పారు. వ్యాధికి బలికావడానికి మనస్కరించక తనకున్న స్వల్ప ఆర్థిక వనరులతో ముగ్గురు పిల్లలను చూసుకోవలసిన బాధ్యత ఉన్నందున 2013 ఆగస్టు 23న ప్రాక్టీషనర్ని సందర్శించారు. ఆమె AVP గా అర్హత సాధించిన ఆరు నెలల తర్వాత ఆమె మొదటి క్యాన్సర్ రోగి ఇతడే. రోగి చాలా బాధలో ఉన్నట్లు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఆమె కనుగొన్నారు. అతని నోటి నుండి చీము కారుతూ అతను స్పష్టంగా మాట్లాడ లేక పోతున్నాడు. అంతేకాక అతను 4 సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో కాలు కోల్పోవడంతో కృత్రిమ అవయవముతో గడుపుతున్నట్లు తెలిపినప్పుడు అతని పరిస్థితి ఆమెను కదిలించింది. అతనికి భరోసా ఇస్తూ హృదయ పూర్వక ప్రార్థనతో క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC2.1 Cancers-all + CC2.2 Cancer pain + CC2.3 Tumours & Growths + CC10.1 Emergencies + CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD
#2. CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders…OD రాత్రి నిద్ర పోయే ముందు
అతను అల్లోపతి మందులు అన్నీ ఆపివేసి వైబ్రో వైద్యానికి ఉపక్రమించారు. చికిత్స ప్రారంభించిన 48 గంటల తరువాత అతని భార్యఫోన్ చేసి పేషెంటుకు చీము కారడం ఆగిపోయిందని నొప్పి తట్టుకోగలిగినంత స్థాయిలో ఉన్నట్లు బాగా నిద్రపోగలుగు తున్నట్లు తెలిపారు. మూడు వారాల తరువాత అతని నొప్పి పూర్తిగా పోయినట్లు మరియు దేవునిపై తన క్షీణించిన విశ్వాసం పునరుద్ధరించబడిందనీ తెలియజేయడానికి స్పష్టంగా మాట్లాడాడు. అతను బాగా నిద్రపోగలుగుతున్నందుకు 2013 అక్టోబరు 23న #2 ఆపివేయబడింది, మరియు #1ని 6TD వద్ద కొనసాగించడానికి పేషంటు ఇష్టపడ్డారు. ఆరు నెలల తర్వాత 2014 ఏప్రిల్ 30 న మోతాదు QDS కు తగ్గించబడింది. 2015 జూలై 8న మరో సంవత్సరం తరువాత అతని వార్షిక పరీక్ష అతనికి క్యాన్సర్ రహితమని ప్రకటించడంతో మోతాదు TDS కు తగ్గించబడింది. 2018 డిసెంబర్ 20న ఉపశమన కాలం ముగిసిన తర్వాత రోగి తన క్యాన్సర్ పునరావృతం కాలేదని గొప్ప ఉపశమనంతో ధ్రువీకరించారు. 2019 ఏప్రిల్ నెలలో మోతాదు ఆపడానికి ముందు OD కి తగ్గించబడింది. 2020 జూన్ 24న సంప్రదించినప్పుడు వ్యాధి పునరావృతం కాలేదని అతను ధ్రువీకరించాడు. మంచి ఆరోగ్యముతో చక్కని జీవనం గడుపుతూ స్వామికి కృతజ్ఞతతో తన ఇంట్లో నిత్యమూ భజనలు నిర్వహిస్తున్నారు, ప్రాక్టీషనర్ సలహామేరకు #1 ని OW నివారణ మోతాదుగా కొనసాగించడానికి అంగీకరించారు.