స్పాండిలైటిస్, చర్మంపై దురద 11614...India
54 ఏళ్ల వ్యక్తి ప్రాక్టీషనర్ని సందర్శించే నాటికి అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. గత ఆరు నెలలుగా అతనికి భుజం మరియు మెడ రెండింటిలో నిరంతరం నొప్పి మరియు దృఢత్వంతో పాటు అసౌకర్యం లేకుండావాటిని కొంచం కూడా కదిలించలేని స్థితి ఏర్పడింది. అయినప్పటికీ అతను ఎటువంటి మందులు తీసుకోలేదు. ఈ నొప్పులకు అదనంగా మూడు నెలల క్రితం అతని ఎడమ చేతి మరియు ఎడమ కాలి ముందరి అంచు చర్మం మీద దురద ఏర్పడి అతనిని అన్ని సమయాల్లో బాధపెడుతోంది. అతని వైద్యుడు సూచించిన లేపనం ఏమాత్రం సహాయపడలేదు కాబట్టి అతను దాన్ని ఉపయోగించడం మానివేశాడు. 15 రోజుల క్రితం, మెడ మరియు భుజం నొప్పి భరింప రానిదిగా మారి ప్రతీ రాత్రీ శరీరమంతా నొప్పి కలగసాగింది. అతను చెకప్ కోసం తిరిగి ఆస్పత్రికి వెళ్లాడు అది స్పాండిలైటిస్ అని నిర్ధారణ చేయబడింది. డాక్టరు ఫిజియో థెరపీ సూచించగా అతను ఒక వారం రోజులు హాజరైనాడు అది అతనికి పెద్దగా సహాయం చేయలేదు. రెండవ వారం అల్లోపతి మందులను తీసుకోగా ఇది అతనికి కొంత ఉపశమనం కలిగించింది, కానీ నొప్పి ఇంకా కొనసాగింది. మూడు రోజుల క్రితం, అతను ఎడమ భుజంలో తిమ్మిరి అనుభవించడం ప్రారంభమయ్యింది. దీనితో ఆలోపతి మందులను తీసుకోవడం మానివేసి, బదులుగా వైబ్రియానిక్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2019 సెప్టెంబర్ 29న ప్రాక్టీషనర్ అతనికి క్రింది రెమిడీ ఇచ్చారు:
CC20.5 Spine + CC21.3 Skin allergies…TDS
ఐదు రోజుల్లో రోగి మెడ మరియు భుజాలలో తిమ్మిరి నొప్పి మరియు దృఢత్వం నుండి విముక్తి పొందాడు. అదనంగా దురద 60 నుంచి 70 శాతం వరకు మెరుగుపడింది. 2019 అక్టోబర్ 17 నాటికి అతని బాధించే ఈ లక్షణాల నుండి అతను 100% విముక్తి పొందాడు చికిత్స ప్రారంభించిన 18 రోజులలో అన్ని శారీరక అసౌకర్యముల నుండి విముక్తి పొందడం అతనికి ఒక అద్భుతం గా ఉందని చెప్పాడు. మోతాదు మొదట OD కి తగ్గించబడింది. తర్వాత మూడు వారాల వ్యవధిలో OW కు తగ్గించబడి నవంబర్ 7న ఆపివేశారు. 2019 డిసెంబర్ 19న అంతా బాగానే ఉన్నట్లు రోగి ధ్రువీకరించాడు. 2020 ఏప్రిల్ నాటికి రోగలక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.