నిద్రలేమి 03582...South Africa
66-ఏళ్ల గృహిణి గత 17 సంవత్సరాలుగా నిద్రలేమితో బాధపడుతున్నారు. ప్రతీ రాత్రీ ఆవిడ మూడు గంటలు మాత్రమే నిద్రపో గలుగుతున్నారు. దీని వలన ఆమెకు నీరసం, చికాకు, మరియు మానసికంగా శారీరకముగా అలసట ఏర్పడుతున్నాయి. ఆమె సాధారణ ఇంటి పనులు కూడా చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ నిద్రలేమికి ఆమె ఎటువంటి ఔషధం తీసుకోలేదు. 2019 సెప్టెంబర్ 19న ఆమె అభ్యాసకుని సందర్శించగా క్రింది నివారణఇవ్వబడింది:
CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders… నిద్రించడానికి అరగంట ముందు ఒకటి మరియు నిద్రకు ఉపక్రమించే ముందు మరొకటి, నిద్రించే సమయంలో మెళుకువ వస్తే అదనంగా మరియొక మోతాదు.
ఆమె నిద్రించే విధానంలో క్రమంగా మార్పు వస్తూ ఒక వారం తర్వాత ఆమె లో 50% ఉపశమనం కనిపించింది. ప్రస్తుతం ఆమె ఐదు గంటల గాఢమైన నిద్రను అనుభవించ గలుగుతున్నారు. మరొక వారం తర్వాత, ఆమెకు 80% మెరుగుదల కనిపించింది. ఆమె ఉత్సాహభరితంగా శక్తివంతంగా ఉండటమే కాక ఇంట్లో చేయవలసిన నిత్య కార్యక్రమాలను యధావిధిగా ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నారు. మూడవ వారం ముగిసే నాటికి అనగా 2019 అక్టోబర్ 10 న, తనకు 100% ఉపశమనం కలిగినట్లుగా తెలిపారు. ప్రస్తుతం “పసిబిడ్డ వలె” నిద్రపోగలుగుతున్నానని నిద్ర లేచిన వెంటనే ఎంతో ప్రశాంతంగా ఉంటోందని తెలిపారు. ఆమెకు 8 నుంచి 9 గంటల నిద్ర పడుతుండటంతో, డిసెంబర్ 8 నాటికి మోతాదును 3TW, వారం తర్వాత 2TW ఆ తర్వాత OWకి తగ్గించి 2019 డిసెంబర్ 28న ఆపివేయడం జరిగింది. 2020 ఫిబ్రవరి 25 నాటికి ఆమెకు ఎటువంటి రోగ లక్షణాల పునరావృతం లేకుండా చక్కగా ఉన్నారు.