ఉదరంలో నొప్పి 11618...India
47 సంవత్సరముల వ్యక్తి గత తొమ్మిది నెలలుగా పొత్తి కడుపుకు కుడివైపు మందకొడిగా ఉండే నొప్పి కలిగి ఉన్నారు. అతని యొక్క పని ఒత్తిడి వలన, వైద్యుడిని సంప్రదించ లేదు. 2019 ఆగస్టు 4 వ తేదీనాటికి గత రెండు రోజులుగా నిరంతరం నొప్పితో బాధపడుతూ అతను ముందుకు వంగినప్పుడు ఈ నొప్పి భరింప శక్యము కాకుండా ఉండే సరికి అభ్యాసకుని సంప్రదించారు. వీరు ఇతర మందులు ఏమీ తీసుకోలేదు. నొప్పి నివారణకు వీరికి క్రింద నివారణ ఇవ్వబడినది:
CC4.3 Appendicitis + CC4.10 Indigestion + CC10.1 Emergencies…6TD
మరుసటి రోజుకి, అతని నొప్పి యొక్క తీవ్రత 20 శాతం తగ్గింది. సరిగ్గా వారం తర్వాత, ఆగస్టు 11న, నొప్పి90% తగ్గిందని ఐతే ఈ నొప్పి వ్యాయామం సమయంలో మాత్రము స్వల్పంగా ఉంటోందని తెలిపారు. అందువల్ల, మోతాదు TDS కు తగ్గించబడింది. ఆగస్టు 19 నాటికి 100% ఉపశమనం కలిగినట్లు తెలపడంతో, మోతాదు ODకి తగ్గించబడింది. ఐతే 2019 ఆగస్టు 29 నాటికి పూర్తిగా తగ్గిపోవడంతో, నివారణలు తీసుకోవడము ఆపివేశారు. 2020 ఫిబ్రవరి నాటికి అభ్యాసకుడు ఆరాతీయగా, నొప్పి మరలా పునరావృతం కాలేదని పేషంటు తెలిపారు.