శీతాకాలపు దద్దుర్లు 02870...USA
63 ఏళ్ల మహిళ దాదాపు 15 సంవత్సరాలుగా ప్రతీ శీతాకాలంలోనూ తన వీపు భాగంలో ఎరుపుదనం మరియు దురదతో కూడిన దద్దుర్లతో బాధపడుతోంది. ఇది ఆమె వెనుక భాగం నుండి ఛాతీ క్రింద ఉదర ప్రాంతానికి వ్యాపించింది. అక్కడ చర్మం మృదుత్వం కోల్పోయి చాలా గట్టిగా పీటలాగా మారిపోయినట్లు అనిపించింది. ఆమె నివసించే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏక అంకె స్థాయికి సింగిల్ డిజిట్ (ఫారన్ హీట్ మానంలో)కి పడిపోయినప్పుడు దురద ప్రారంభమవుతుంది. కొన్ని సమయాల్లో ఈ లక్షణాలు శరదృతువు చివర్లో (సెప్టెంబర్) లేదా శీతాకాలం ప్రారంభంలో మొదలవుతాయి. అలాగే ప్రతీ జూన్ లో ఉష్ణోగ్రత పెరగడంతో దద్దుర్లు మాయమైపోతాయి 2015 సెప్టెంబర్ 3వ తేదీన రోగి ప్రాక్టీషనర్ ని సందర్శించే నాటికి, ఆమె మందులేవీ తీసుకోవడం లేదు.
ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది
CC12.1 Adult tonic + CC21.1 Skin tonic + CC21.6 Eczema + CC21.10 Psoriasis…TDS
6 వారాల తర్వాత, అనగా 2015 అక్టోబర్ 20 నాటికి, రోగి తన చర్మంపై దద్దుర్లు లేవని చర్మం గాజు వలె నునుపుగా మృదువుగా ఉందని తెలపడంతో మోతాదును BD కి తగ్గించారు కానీ పది రోజుల తర్వాత, మరలా దురద ఆమె వెనుక భాగంలో పెరిగినట్లు ఫిర్యాదు చేయగా, మోతాదు తిరిగి TDSకు మార్చబడటంతో ఉపశమనం ప్రారంభమైంది.
2016 మార్చి13 వ తేదీన, రోగి 2015-16 శీతాకాలములో తనకు ఎటువంటి దద్దుర్లు రాలేదని, దురద కూడా లేదని గత నాలుగు నెలలుగా 100% ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. కనుక మోతాదును నెల పాటు ODకి తగ్గించారు. రోగ లక్షణాలు పునరావృతం కాకపోవడంతో మోతాదు క్రమంగా 3TW, 2TW, చివరిగా OW స్థాయికి మూడు నెలల్లో తగ్గించి ఆపివేయడం జరిగింది. ఏడు నెలల తర్వాత, 2017 ఫిబ్రవరి లో రోగి తనకు 2016-17 శీతాకాలంలో కూడా రోగ లక్షణాలు ఏమీ పునరావృతం కాలేదని తెలిపారు. పేషెంట్ ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవడంతో, ఎటువంటి సమాచారం పొందలేకపోయారు.