అతిసారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 03542...UK
2019 ఆగస్టు 22న, ఒక సెలవు రోజు అభ్యాసకుడు ప్యారిస్ లో ఒక హోటల్ లో ఉన్నప్పుడు, అదే హోటల్లో అనారోగ్యంతో ఉన్న 75 ఏళ్ల మహిళ భర్త అర్ధరాత్రి అభ్యాసకుని సహాయం అర్ధించడం జరిగింది. ఆమెకు ఉదయం నుండీ కడుపులో తిమ్మిరి, విరోచనాలు, తలపోటు మరియు ఛాతీలో రద్దీ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని అయితే ఆమె హాస్పిటల్ కి వెళ్లడానికి ఇష్టపడలేదని రోగి భర్త తెలిపారు. అభ్యాసకుడు వెంటనే తనవద్దనున్న వెల్నెస్ కిట్టు నుండి క్రింది రెమిడీ ఇచ్చారు:
అతిసారం కోసం :
#1. Eat Well + Emergency… ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఒక గంట వరకూ, అలాగే ఒక గంట విరామం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నిమిత్తం :
#2. Breathe Well… #1 వలే అదే మోతాదు
ఉదయానికల్లా రోగికి చాలా వరకూ ఉపశమనం కలిగింది. ఆమెకు తిమ్మిరి, తలనొప్పి, విరేచనాలు, శ్వాసలో ఇబ్బంది విషయంలో 75% మెరుగుదల కనిపించింది. రోగి పూర్తిగా కోలుకోవడంతో, మోతాదు 25 ఆగస్టు నాటికి TDS, మరో రెండు రోజుల తరువాత OD కి తగ్గించి, ఆగష్టు 29న నిలిపి వేయడం జరిగింది. ఆ తర్వాత వారికి ఉన్న కొన్ని సెలవలలో రోగి ఉల్లాసంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ కృతజ్ఞతతో ఆ జంట ఇప్పటికీ అభ్యాసకుడుతో సన్నిహితంగా ఉంటున్నారు.
108 సిసి బాక్స్ ఉపయోగిస్తుంటే, ఇవ్వండి: సిసి 4.6 డయేరియా