Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఎండిన మరియు ఆకులులేని మొక్కలు 11606...India


In the practitioner’s house, two houseplants, Bougainvillea and Asparagus fern had dried up and had no leaves on their branches since February 2019 (see pics).

ప్రాక్టీషనర్ ఇంటిలో పెంచుకునే రెండు మొక్కలు బోగన్ విల్లా(కాగితం పూల మొక్క) మరియు ఆస్పరేగస్ ఫెర్న్(పాలగ్లాసు మొక్కగా పిలవబడేది) 2019 ఫిబ్రవరి నుండి ఎండిపోయి కొమ్మలకు ఆకులు కూడా లేకుండా ఉంటున్నాయి(చిత్రాలు చూడండి).

ప్రాక్టీషనర్ అయిన వెంటనే 2019 మార్చి 15 న,   ఆమె ఈక్రింది రెమెడీతో చికిత్స చేశారు:
#1. CC1.2 Plant tonic…OD

ఇది 15రోజుల తరువాత కూడా ఎటువంటి మెరుగుదల చూపించక పోవడంవల్ల, ఏప్రియల్ 1న రెమెడీ  #1ని ఈక్రింది విధంగా మార్చారు:  

#2. CC12.1 Adult tonic + #1…OD

క్రమంగా పదిహేను రోజులలో అవి కోలుకోవడం ప్రారంబించాయి. తరువాతి 4 వారాల వ్యవధిలో, మొక్కలు చక్కగా ఎదిగి ఆరోగ్యంగా దాదాపు రెట్టింపు పరిమాణంతో అభివృద్దిచెందాయి! ఆస్పరాగస్ ఫెర్న్ లో మొదట పచ్చదనం ఆనవాళ్ళు లేవు , ఇప్పుడు చూస్తే నిజంగా ఎంతో బాగుంది(చిత్రంలో చూడండి). బోగన్విల్లా కూడా పుష్పించడం ప్రారంభం కావడంతో ఇప్పుడు ఎంతో అందంగా కనిపించసాగింది.(చిత్రంలో చూడండి). మోతాదుని 2019 జూన్ నెలలో ఆపేవరకు  క్రమంగా తగ్గించబడినది. ఆస్పరాగస్ ఫెర్న్ నిరంతరం ఆరోగ్యంగా ఉంది కానీ ప్రాక్టీషనర్ కొన్నినెలలక్రితం ఇంటిని మారడంవల్ల, ఆమె బోగన్విల్లా ను తనతో తీసుకువెళ్లలేక పోయారు.