Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

పిత్తాశయంలో రాళ్ళు 01616...Croatia


2018లో, 53సంవత్సరాల వయస్సు ఉన్న మహిళకి పిత్తాశయంలో 2.5cm పరిమాణంలో రాయి  ఉన్నట్లు నిర్దారించారు. గత సంవత్సరకాలంగా ప్రతీరోజూ ఆమెకడుపు నొప్పితో బాధపడుతున్నారు. భోజనం చేసిన తరువాత ఈ నొప్పి అద్వాన్నంగా ఉంటోంది.  ఈ సమస్య లేకపోతే ఆమె ఆరోగ్యంగా ఉండేవారు మరియు ఎటువంటి మందులు తీసుకునేవారు కాదు, ఆమె యొక్క నాయనమ్మ పిత్తాశయంలో రాయిపగిలి పోవడం వలన  చనిపోవడం మరియు ఆమె కుటుంబంలో మూత్రపిండంలో రాళ్ళు ఉన్న కేసులు ఉండటంతో ఆమె చాలా భయపడుతున్నారు.

వైబ్రియానిక్స్ మీద మాత్రమే ఆధారపడి, ఆమె 2019 జనవరి 21 న ప్రాక్టీషనర్ దగ్గరకు వచ్చారు, ఆమెకు ఈక్రింది రెమెడీ ఇవ్వడమైనది:  
#1. SR275 Belladonna 1M + SR325 Rescue...ప్రతి 10 నిమషాలకు ఒక మోతాదు చొప్పున 1 గంట వరకు ఆ తరువాత 6TD
#2. CC4.7 Gallstones + CC15.1 Mental &Emotional tonic...TDS

తీసుకున్న తరువాత రోజే ఆమెకి నొప్పి 50% తగ్గినట్లు తెలిపారు, #1 యొక్క మోతాదు QDSకి తగ్గించబడినది మరియు వారం తరువాత ఆపివేయబడినది. అయితే #2ని TDS వద్ద కొనసాగించారు. ఆమె మరలా 2019 మార్చి 15 న  ప్రాక్టీషనర్ ను  సందర్శించి, తాను ఇటీవలే అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకున్నట్లు అందులో పెద్ద రాయి ఉన్న గుర్తు కూడా లేదని కానీ, చిన్న చిన్న రాళ్ళు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించినదని, ఐతే ప్రస్తుతం తాను భాగానే ఉన్నట్లు ఎటువంటి నొప్పిలేకుండా మామూలుగానే ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపారు.

 అందువలన, #2 ని ఈవిధంగా మార్చడమైనది: 
#3. CC4.7 Gallstones + CC17.2 Cleansing...TDS

 2019 ఏప్రియల్ 28 న, అల్ట్రాసౌండ్ పరీక్ష మరలా చేయించుకున్న నివేదికలో పిత్తాశయం రాళ్ళు లేదా ఇసుక లేకుండా చక్కగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. ఒక వారం తరువాత, మోతాదు ODకి తగ్గించడమైనది, తరువాత OWకి తగ్గించి నెల తరువాత ఆపివేయబడినది. డిసెంబర్ 2019 నాటికి, వ్యాధి పునరావృతం కాలేదు.

ఎడిటర్ యొక్క సూచన: ముందస్తు నివారణా చర్యగా, CC17.2 Cleansing…TDS  ఒక నెలపాటు, తరువాత నెల CC12.1 Adult tonic…TDS, అలా సంవత్సరం పాటు ఇవ్వడం మంచిది.  గమనించ వలసిన విషయం ఏమిటంటే ఈ కేసు విషయంలో  పెద్ద రాయి ఉన్నప్పుడు, వైబ్రో రెమెడీ ఆ అంగము నుండి ఇసుకను తీసివేయడానికి ముందు, మొట్టమొదట పెద్దరాయిని చిన్న చిన్న ముక్కలగా చేస్తుంది. వ్యవస్థలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడానికి పేషెంట్ తన ఆహారంలో రిచ్ ఫుడ్ ఉదాహరణకి :వెన్న, క్రీమ్, మాంసం మొదలగునవి  తీసుకోవడం నివారించాలి. 

108CC బాక్స్  ఉపయోగిస్తున్నవారు  #1. CC4.7 Gallstones ఇవ్వాలి.