Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మోకాళ్ళ నొప్పి 11602...India


70 సంవత్సరాల మహిళకి, గత 6 నెలలగా పెయిన్ కిల్లర్స్ మరియు ఫిజియోతెరఫీ తీసుకుంటున్నప్పటకి, రెండు మొకాళ్లలో తీవ్రమైన నొప్పితో భాధపడుతూ నడవడం కష్టంగా మరియు కఠిన పరీక్షలాగా ఉంటోంది. రెండు నెలల క్రితం పరీక్ష చేయించుకొన్నప్పుడు ఆమెకు కొలెస్ట్రాల్ ఎక్కువస్థాయిలో 280 mg/dl ఉన్నట్లు తెలిసింది. దీనినిమిత్తం ఆమె అల్లోపతీ మందులు తీసుకుంటున్నారు. 2019మార్చి9న, ప్రాక్టీషనర్ను సందర్శించేనాటికి, ఆమెకి రోజు వారీ నడక కూడా కష్టంగా ఉంది.ఆమెకు కొలెస్ట్రాల్ మరియు మోకాళ్ళ నొప్పి కోసం ఈ క్రింది రెమెడీ ఇవ్వడమైనది:
CC3.5 Arteriosclerosis + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.6 Osteoporosis…TDS 

వేయించడానికి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించవద్దని, ఆహారంలో సలాడ్స్ మరియు చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోమని ప్రాక్టీషనర్‌ సలహా ఇచ్చారు.మూడు రోజులు తరువాత నొప్పి నుండి 90% ఉపశమనం పొందినట్లు మరియు మరో నాలుగు రోజుల తరువాత నొప్పి నుండి పూర్తిగా ఉపశమనం పొందినట్లు తెలిపారు. వైబ్రియానిక్స్ మందులు తీసుకుంటూ ఆహారంలో మార్పులు చేసుకోటం వల్ల ఆమె ఆరోగ్యం గా ఉండటంతో 2019మార్చి17న, కొలెస్ట్రాల్ కోసం తీసుకునే అల్లోపతీ మందులు నిలిపివేశారు. మరో వారం తరువాత పెయిన్ కిల్లర్స్ మరియు ఫిజియోతెరఫీ కూడా నిలిపివేశారు. ఎటువంటి నొప్పి లేకుండా రోజువారీ పనులు తేలికగా చేసుకోగలగడం మరియు కొలెస్ట్రాల్స్థాయి127mg/dl కి రావడంతో,2019మే9న మోతాదుని ODకి తగ్గించారు, తరువాత2019మే 25న OW గా తగ్గించబడినది.5 నెలల తరువాత,2019మే9న, ఆమె కొలెస్ట్రాల్స్థాయి127mg/dlవద్ద స్థిరంగా ఉన్నట్లు, నొప్పులు తగ్గినట్లు మరియు మోతాదుని OW గా తీసుకుంటున్నట్లు తెలిపారు.వీటితోపాటు,నివారణ చర్యగా ఆమెకి CC17.2 Cleansing…OD ఇవ్వడమైనది.