మణికట్టు మరియు మోచేతి కీళ్లలో దీర్ఘకాలిక నొప్పి 11605...India
68 ఏళ్ల మహిళకి 6 నెలల క్రితం నుండి తన కుడి ముంజేయి మరియు మోచేయి కీళ్ళలో తేలికపాటి నొప్పి ప్రారంభమైనది. నొప్పి పెరగడంతో రోజువారీ వంటగది పనులను కొనసాగించడం ఆమెకు కష్టతరం కావడంతో, ఆమె ఒక ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించింది, అతను సూచించిన విధంగా పెయిన్ కిల్లర్ తీసుకుంటూ జెల్ ను అప్లై చేసేవారు. అతిగా వాడటం వల్ల ఆమె కండరాలు బలహీనంగా ఉన్నందున, ఆమె ముంజేయికి కనీసం ఒక నెల రోజులు విశ్రాంతి ఇవ్వమని వైద్యుడు సలహా ఇచ్చారు. ఒక వారంలో నొప్పి తగ్గింది మరియు ఆమెకు ఇంటి పనులలో ఎవరి సహాయం లేనందున, నిర్దేశిత విశ్రాంతి కాలం ముగిసేలోపు, ఆమె తన సాధారణ ఇంటి పనిని తిరిగి ప్రారంభించింది. ఒక నెలలోనే, ఆమెకి నొప్పి మళ్లీ ప్రారంభమైంది. ఆమె దానిని 3 నెలలు పాటు విస్మరించింది, దీనివలన నొప్పి చాలా ఎక్కువైంది మరియు నిరంతరం ఉంది, అది ఎలా ఉంది అంటే ఆమె స్నానం చేసేటప్పుడు కనీసం ఒక మగ్ నీళ్ళు కూడా ఎత్త లేకపోయింది. ఈసారి ఆమె ఇటీవల ప్రాక్టీషనర్‌గా అర్హత సాధించిన తన అల్లుడి నుండి వైబ్రియోనిక్స్ చికిత్స తీసుకోవడానికి సిద్ధపడింది.
2019 ఫిబ్రవరి 11 న, ఆమెకు ఈక్రింది రెమెడీ ఇవ్వబడింది
#1. CC20.2 SMJ Pain + CC20.4 Muscles & Supportive tissue…TDS
3 రోజుల్లో, ఆమె నొప్పి50% తగ్గింది, మరియు మరో 4 రోజుల్లో ఆమె నొప్పిని భరించగలడంతో తన ఇంటి పనులను తిరిగి ప్రారంభించింది. రెమెడీ ప్రారంభించిన ఒక నెల తరువాత, ఇంట్లో పనిభారం పెరిగిన సందర్భాలలో తప్ప ఆమెకి నొప్పి లేకుండా ఉంది. మరో నెల తరువాత, ఆమె తన ఇంటి పనులన్నీ ఎటువంటి నొప్పి లేకుండా చేయగలిగినప్పటికి TDS వద్ద రెమెడీను కొనసాగించడానికి ఇష్టపడింది.
ఆమె వయస్సు మరియు ఇంటి పని చేయవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, రెమెడీ #1ని 2019 మే 1న క్రింది విధంగా మెరుగు పరిచి ఇవ్వడమైనది:
#2. CC12.1 Adult tonic + #1…OD
2019 జూలై 1న, #2 ఆపివేయబడింది. రెమెడీ # 1ని 3TW వద్ద తిరిగి మొదలుపెట్టి, ఆగస్ట్ 1 న ఆపివేయబడే వరకు క్రమంగా తగ్గించబడింది. నివారణా చర్యగా ఆమెకు CC17.2 Cleansing…TDS ఒక నెల పాటు, తరువాతి నెల CC12.1 Adult tonic + CC20.4 Muscles& Supportive tissue, అలా సంవత్సరం పాటు ఇవ్వటం జరిగింది. 28 ఆగష్టు 2019 నాటికి ఆమెకు పూర్తిగా నయం అయినది.