పునరావృతమయ్యే టైఫాయిడ్ 03572...Gabon
56 ఏళ్ల మహిళకి 2018 జూలైలో టైఫాయిడ్ ఉందని నిర్దారించబడడంతో 2 నెలల వ్యవధిలో పునరావృతమవుతున్న జ్వరం కోసం రెండుసార్లు అల్లోపతి చికిత్సను తీసుకున్నారు. 2018 సెప్టెంబర్ చివరి నాటికి, ఆమెకి మూడవసారి జ్వరం వచ్చి ఆమె పొత్తికడుపు, నడుం, కాళ్ళలో నొప్పి సాధింపు తో పాటు మోకాళ్ళు మరియు పాదాలకు కూడా ఈ నొప్పి విస్తరించింది. ఈసారి ఆమె అల్లోపతి చికిత్సను ఎంచుకోక బదులుగా2018 అక్టోబర్ 7 న అభ్యాసకుడిని సందర్శించగా ఆమెకు ఈ క్రింది రెమెడీ ఇవ్వబడినది:
పునరావృత టైఫాయిడ్ కోసం:
#1. CC3.7 Circulation + CC4.8 Gastroenteritis + CC4.11 Liver & Spleen + CC9.3 Tropical diseases…TDS
నొప్పి కోసం:
#2. CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures… ప్రతి 10నిమషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు, తరువాత 6TD 5 రోజులు, తరువాత TDS.
రెమెడీ ప్రారంభించిన దాదాపు 8 వారాల తరువాత నవంబర్ 29 న, నొప్పులు 50% మాత్రమే తగ్గాయని అయితే జ్వరం నివారణ ప్రారంభించిన 2 రోజుల్లోనే తగ్గిందని మరియు పునరావృతం కాలేదని రోగి చెప్పారు.
అభ్యాసకుడు #1  ను ఆపివేసి ప్రతీ వారo ఎలా ఉందో తెలియపరచమని సలహా ఇస్తూ ఈ క్రింది రెమెడీని ఇచ్చారు:
#3. CC9.1 Recuperation…TDS
2019 జనవరి 29న రోగి అన్ని నొప్పుల నుండీ 100% ఉపశమనం పొందినట్లు చెప్పారు. వారం తరువాత ఎలా ఉందో చెప్పమని సలహా ఇచ్చి #3 యొక్క మోతాదు OD కి తగ్గించారు. కానీ, రోగి ఒక వారం తర్వాత కొనసాగించవలసిన అవసరం రాకపోవడంతో రెమెడీను ఆపివేసింది. ఆమెకి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు 3 నెలల తర్వాత
ఆగష్టు 2019 నాటికి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నారు.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య : ఎక్కువ మంది రోగులు సమయానుసారంగా సమాచారం ఇవ్వడం గురించి పట్టించుకోరు. అంతేకాక వారు మందులు పనిచేస్తున్నప్పుడు రెమెడీలను ఆకస్మికంగా ఆపితే వ్యాధి పునరావృతం అవుతుందన్నా విషయం తెలిసినా తేలికగా తీసుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో మోతాదుని సరైన పద్ధతిలో తగ్గించటం అసాధ్యం అవుతుంది.
సంపాదకుని సూచన : రోగి అనుభవించిన అన్నినొప్పులు టైఫాయిడ్ యొక్క లక్షణాలే కాబట్టి , రెమెడీ #2 అవసరం లేదు; రోగికి టైఫాయిడ్ లక్షణాలు కనిపించకుండా పోయే వరకు రెమెడీ #1 లో CC9.3 Tropical diseases ఒక్కటే సరిపోతుంది, తరువాత CC9.1 Recuperation ఇవ్వాలి