మెడభాగంలో వెన్నుపూస క్షీణత 03553...Canada
53 సంవత్సరాలు వయస్సు గల వ్యక్తి గత 5 నెలలుగా మెడనొప్పితోపాటు భుజం నుండి చేతివేళ్ళ వరకు తిమ్మిరితో కూడిన నొప్పితో భాధపడుతున్నాడు. ఇది సర్వికల్ డిస్క్ డీజెనరేషన్ లోపంగా నిర్థారించారు. పేషెంట్ కంప్యూటర్ నిపుణుడు కావడం వలన ఎక్కువసేపు కంప్యూటర్ మీద పనిచేయడం నొప్పికి ప్రధానకారణంగా భావించారు. బ్యాడ్మింటన్ క్రీడకారుడైన ఇతడు నొప్పికారణంగా తన ఆటకు దూరం అయ్యారు. అల్లోపతి చికిత్సతీసుకోనప్పటికీ ఫిజియోథెరపీ మరియు ఆక్యుపంక్చర్‌ను ఒకదాని తరువాత ఒకటి తీసుకుంటున్నారు. అతనికి వీటి వలన పెద్దగా ప్రయోజనం ఏదీ కనిపించలేదు.
2017 జనవరి 8 న అభ్యాసకురాలు అతనికి ఈ క్రింది రెమెడీ ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + CC20.6 Osteoporosis...TDS
6 వారాలలో మెడ నొప్పి మరియు భుజం నుండి కుడి చేతి వేళ్ల వరకు ఉన్నతిమ్మిరి మరియు నొప్పి అదృశ్యమయ్యాయి. ఐతే భుజంలో ఇంకా కొంత నొప్పి ఉన్నప్పటికీ ప్రస్తుతం తన మెడ మరియు భుజాలను స్వేచ్ఛగా కదిలించగల పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో అతను వైబ్రియోనిక్స్ ని మాత్రమే కొనసాగిస్తూ ఫిజియోథెరపీ మరియు ఆక్యుపంక్చర్ చికిత్సలు తీసుకోవడం మానేశారు.
2017 మార్చి3న అభ్యాసకురాలు రోగికి అవసరమైన వానికంటే ఎక్కువ కోంబోలను ఇచ్చినట్లు గ్రహించి #1 కి ప్రత్యామ్నాయంగా ఈ క్రింది నివారణి ఇచ్చారు:
#2. CC18.5 Neuralgia + CC20.5 Spine...TDS
మరో 10 వారాల తరువాత, 2017 మే 12న రోగి నొప్పి తగ్గిపోవడంతో రెమెడీను ఆపాలని కోరుకున్నాడు, కాని అభ్యాసకురాలు మోతాదును OW గా కొనసాగించమని సలహా ఇచ్చారు. అతను వృత్తిరీత్యా కంప్యూటర్స్ మీద పని చేయకుండా ఉండటం సాధ్యంకాదు కనుక ఉపశమనం పొందడానికి ఎక్కువ సమయం పట్టిందని భావించారు.7 నెలల తరువాత, రోగి నొప్పి పునరావృతం కాలేదని మరియు రెమెడీలు అయిపోయాయి అని చెప్పారు.
2019 ఆగస్టు 17న, రోగి అభ్యాసకురాలిని కలిసినప్పుడు ఎటువంటి నొప్పి పునరావృతం లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పటికి ముందస్తు నివారణ చర్యగా అతని రోగనిరోధక శక్తిని మరియు ఎముకలకు బలాన్ని కలిగించడానికి ఈ క్రింది రెమెడీలు ఇచ్చి వాటిని ఒక సంవత్సరం పాటు కొనసాగించాలని సలహా ఇచ్చారు:
#3. CC12.1 Adult tonic + CC20.1 SMJ tonic...TDS ఒక నెల రోజులు, ఆ తరువాత #4 నెల రోజులు, మరలా # 3. ఈ విధంగా ఒక సంవత్సరం
#4. CC17.2 Cleansing…TDS