Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

రైనైటిస్, బ్రాంఖైటిస్ 11601...India


44-ఏళ్ల వ్యక్తి పుట్టినప్పటి నుంచి తరచూ శ్వాస కోశ ఇబ్బందులతో( ఛాతీలో గరగర మనే శబ్దం వినిపించడం) బాధపడుతున్నారు. దీంతోపాటు ముక్కు కారడం ముక్కు రంధ్రాలు మూసుకుపోయినట్లు ఉండటం తలనొప్పి కూడా ఉన్నాయి. బాల్యంలో ఇతడి తల్లి కొంత ఉపశమనం కలిగించడానికి అతని ఛాతీ, నుదుట మరియు ముక్కు చుట్టూ విక్స్ వేపొరబ్ రుద్దుతూ ఉండేది. పెద్దయ్యాక తనే స్వయంగా చేసుకోవడం నేర్చుకున్నారు. శ్వాసకు కష్టం కలిగించే పెయింట్లు పెట్రోల్ మొదలైన వాటి దగ్గరకు వెళ్లడం మానుకున్నాడు. రెండువేల సంవత్సరంలో ఈ లక్షణాలు భరించలేక ఒక నిపుణుడిని సంప్రదించగా అతని పరిస్థితి ఎలర్జీ మరియు బ్రాంకైటిస్ అని నిర్ధారించబడగా మందులు తీసుకోవడం ప్రారంభించారు.  గత 12 సంవత్సరాలుగా డాక్టర్ సలహా మేరకు ప్రతి రోజూ నాసల్ స్ప్రే ఉపయోగిస్తున్నారు.  ఈ చికిత్స అతని రోజు వారి జీవిత నిర్వహణకు సహాయపడింది కానీ అతనికి పూర్తి ఉపశమనం ఇవ్వలేదు కనుక ప్రత్యామ్నాయ చికిత్స కోసం వెతకడం ప్రారంభించాడు.

2019 జనవరి 13న రోగి అభ్యాసకురాలిని సంప్రదించగా క్రింది నివారణ ఇచ్చారు:
#1. CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకూ అనంతరం 6TD

ఈ నివారణతో పాటు వీరు అల్లోపతి మందులు కూడా కొనసాగించారు. నాలుగు వారాల తర్వాత అతను అభ్యాసకుని వద్దకు వచ్చినప్పుడు కొంచెం నిస్పృహతో ఉన్నట్లు అనిపించింది. కారణమేమిటంటే ఇచ్చిన నివారణ వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదు అయినప్పటికీ రోగి వైబ్రో మందులు కొనసాగించడానికి నిశ్చయించుకున్నాడు. అభ్యాసకుడు #1 ని క్రింది విధంగా మెరుగుపరచడం జరిగింది:

 #2. CC15.1 Mental & Emotional tonic + #1…6TD

ఒక నెల తర్వాత మార్చి 10వ తేదీన తన తదుపరి సందర్శనలో రోగి తన వ్యాధి లక్షణాలన్నీ క్రమంగా తగ్గుముఖం పట్టాయని  వివరించారు. గత వారం రోజులుగా అతని శ్వాసలో శబ్దాలు, ముక్కు కారడం నాసికా రంధ్రాలు మూసుకు పోవడం, తలనొప్పి వంటివి ఏమీ లేవని అందువలన నాసల్ స్ప్రే తో సహా అలోపతి మందులను ఆపేశారు. ఇతను ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా ఊపిరి పీల్చుకోవడం అభ్యాసకురాలు గమనించారు. అయినప్పటికీ మోతాదు 6TD గానే కొనసాగించ బడింది.

  2019 ఏప్రిల్ 21 న  అనగా 6 వారాలు తరువాత  #2 ను వ్యాధినిరోధక శక్తిని పెంచే మోతాదుగా మార్చడం జరిగింది:
#3. CC12.1 Adult tonic + #2…TDS

 3 వారాల తర్వాత పేషెంటుకు పూర్తి ఉపశమనం కలగడంతో మోతాదు #3 ను OD. కి తగ్గించడం జరిగింది. 2019 జూన్ 16 నాటికి, #3 ను పూర్తిగా ఆపివేయడం జరిగింది.  మరియు  #2 ను 3TW  గా తిరిగి ప్రారంభించడం జరిగింది. దీన్ని నెమ్మదిగా    OW కు తగ్గించడం జరుగుతుంది.

అభ్యాసకుడు క్రింది మోతాదును కూడా కలవడం జరిగింది:
#4. CC12.1 Adult tonic…TDS ఒక నెల వరకు దీనిని  #5 CC17.2 Cleansing, తో రీప్లేస్ చేస్తూ సంవత్సరం వరకు ఈ మోతాదులు తీసుకోవడం ప్రారంభించారు.

సంపాదకుని వ్యాఖ్య :  6TD is అనేది వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఇచ్చే మోతాదు కనుక  #2 ను రోగి మార్చి 10వ తారీఖు వచ్చినప్పుడు TDS  గా తగ్గించి ఉంటే బాగుండేది.