మోకాలినొప్పి, ఫ్లోరైడ్ టాక్సిసిటీ 11578...भारत
50-ఏళ్ల మహిళకు గత రెండు సంవత్సరాలుగా కుడి మోకాలి వద్ద విపరీతమైన నొప్పి ఉంది. ఈ మోకాలి చుట్టూ వాపు కూడా ఉంది. రోగి నివసించిన గ్రామానికి సంబంధించిన నీటిలో ఫ్లోరైడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది కనుక ఫ్లోరైడ్ ప్రభావము వలననే ఈ నొప్పి వస్తున్నట్లుగా అభ్యాసకుడు భావించారు. రోగి యొక్క దంతాలు రంగు కూడా మారిపోయి ఉన్నట్లు అభ్యాసకుడు గమనించారు.
2018 డిసెంబర్ 10వ తేదీన ఆమె యొక్క సమస్యలకు అనుగుణంగా క్రింది నివారణ ఇవ్వడం జరిగింది:
#1. SR253 Calc Flour...6TD
#2. CC3.7 Circulation + CC20.1 SMJ tonic + CC20.6 Osteoporosis...6TD
కేవలం రెండు రోజుల్లోనే నొప్పి మరియు వాపు మాయమైంది. నాలుగు రోజుల తరువాత మోతాదును TDS కి తగ్గించారు. ఆమెకిచ్చిన రెమిడీ మూడు వారాల్లోనే అయిపోయింది కానీ అత్యవసర పని నిమిత్తం ఆమె తన గ్రామానికి వెళ్ళడంతో రీఫిల్ కోసం అభ్యాసకుని సందర్శించ లేక పోయారు. ఏడు వారాల తర్వాత 2019 ఫిబ్రవరి 18న ఆమె అభ్యాసకుని సందర్శించినప్పుడు ఆమెకు అంతా బాగానే ఉందని అంతేగాక గత రెండు నెలల్లో ఆమె సమస్యలు పునరావృతం కాలేదని చెప్పారు. ఆమెకు #1 మరియు #2 ను ODగా తిరిగి ప్రారంభించడం జరిగింది. అంతేగాక రోగి నివసిస్తున్న గ్రామంలో నీటిలో అధిక ఫ్లోరైడ్ ఉన్నందున ముందు జాగ్రత్త కోసం ఈ మోతాదును కొనసాగించాలని అభ్యాసకుడు భావించారు.
సంపాదకులు వ్యాఖ్య: సరియయిన కారణం గుర్తించి నివారణ ఇవ్వడం వలన రెండు సంవత్సరాల సమస్యకు రెండు రోజుల్లో పూర్తి ఉపశమనం కలగడం ఒక ఉత్తేజకరమైన సందర్భం. ఇది వైబ్రీయనిక్స్ యొక్క అద్భుతమైన శక్తిని వెల్లడిస్తోంది.
108CC బాక్స్ ఉపయోగిస్తున్నట్లయితే #2 ను మాత్రమే ఇస్తే సరిపోతుంది ఎందుకంటే దీనిలో SR253 Calc Flour. ఉంటుంది.