మలబద్ధకం మరియు వెన్ను నొప్పి 11587...भारत
63-ఏళ్ల వయసు గల అమెరికన్ మహిళ దీర్ఘకాలంగా వెన్ను దిగువన నొప్పితో బాధ పడుతూ ఏడు సంవత్సరాల క్రితం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. శస్త్ర చికిత్స తరువాత కూడా నొప్పి కొనసాగింది. ఆమెకు సూచింపబడిన నొప్పి నివారణలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చాయి. దీనికి తోడు తీవ్రమైన మలబద్ధకం కూడా మొదలైంది అయితే ఆమెకు చేసిన ఆపరేషన్ తో మలబద్దకానికి ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ చెప్పారు. ఆమె మలబద్ధకం కోసం గృహ చిట్కాలను ఆశ్రయించింది కానీ అంతగా ఉపశమనం కలవలేదు. ఆమె 2017 మార్చి 22 న అభ్యాసకుడిని సంప్రదించగా ఆమెకు క్రింది నివారణ ఇవ్వబడింది:
CC4.4 Constipation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC20.5 Spine + CC20.7 Fractures…ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ అనంతరం 6TD.
పది రోజుల తర్వాత ఆమె కోడలు తన అత్తగారికి మలబద్ధకం మరియు వెన్ను నొప్పి అద్భుతంగా 80 శాతం వరకూ తగ్గిపోయాయని చెప్పారు. కనుక మోతాదు TDSకు తగ్గించడం జరిగింది. మరో పది రోజుల తర్వాత ఆమె ఈ రెండు లక్షణాల నుండి 100% ఉపశమనం పొందారు. మోతాదు OD కి తగ్గించబడింది ఈ విధంగా ఆమె ఆరు నెలలు మోతాదును కొనసాగించారు. అభ్యాసకుడు 2018 అక్టోబర్ లో అందుకున్న తాజా సమాచారం ప్రకారం ఆమె వ్యాధి లక్షణాలు ఏమీ పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నారు.