గోరుచుట్టు 03572...Gabon
35 సంవత్సరాలు వయసు గల మహిళ గత మూడు రోజులుగా ఎడమ చూపుడు వ్రేలి పైన భరించలేని నొప్పితో బాధపడుతూ చికిత్సా నిపుణుడిని 2018 ఆగస్టు 5 వ తేదీన కలిసారు. ఆమె వేలు కొన నుండి గోరు వరకు మంట, వాపు ఉంటోంది. గోరుచుట్టుగా ఇది నిర్ధారించబడింది. ఐతే ఆమె దీనినిమిత్తం ఔషధములు ఏమీ తీసుకోలేదు. ఆమెకు ఈ సమస్య ఇదే మొదటిసారిగా వచ్చిందా అని అడగగా 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సమస్య ఏర్పడి చాలా బాధపడినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రాక్టీషనర్ ఆమెకు ఈ క్రింది కాంబో ఇచ్చారు:
CC18.5 Neuralgia + CC21.11 Wounds & Abrasions...ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున 1-2 గంటల వరకు అనంతరం TDS
ఒక గంటలో ఆమెకు నొప్పి 50%తగ్గింది. మరొక గంట తరువాత ఆమెకు ఎటువంటి నొప్పి లేదు. అప్పటికే వ్యాధి నయమైందని రోగి భావించడం వలన రెమిడీ తీసుకోవడం మానేశారు. కానీ మూడు రోజుల తరువాత నొప్పి పునరావృత మయ్యింది, అందువలన ఆమె TDS గా రెమెడీను తిరిగి ప్రారంభించారు. అదే రాత్రి ఆమెకు నొప్పి పూర్తిగా అధృశ్యమయ్యింది. ఐతే నొప్పి పునరావృత మవుతుందేమో అనే భయంతో OD కి తగ్గించే ముందు TDS గానే మరో 2 వారాల పాటు కొనసాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. మరో రెండు వారాల తరువాత రెమిడీ తీసుకోవడం ఆపివేశారు. నవంబర్ 2018 నాటికి, ఆమెకు సమస్య పునరావృతం కాకపోవడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు