గొంతు ఇన్ఫెక్షన్ 11406...India
88-సంవత్సరముల వయస్సు గల వ్యక్తి గత మూడు వారాలుగా గొంతు నొప్పి మరియు దగ్గుతో బాధపడుతూ డాక్టర్ను సంప్రదించారు. డాక్టర్ అతనికి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. వారం రోజులు కోర్సు పూర్తి చేసినప్పటికీ ఏ మాత్రం మెరుగుదల కనిపించలేదు. దీనితో రోగి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని చికిత్సానిపుణుడిని సంప్రదించారు.
15 జూన్ 2018 తేదీన అతనికి క్రింది కొంబోఇవ్వబడింది:
#1. CC12.1 Adult tonic + CC19.6 Cough chronic...6TD
నాలుగు రోజులు వాడిన తర్వాత పేషెంటు తనకు గొంతు నొప్పి మరియు గొంతు బొంగురు పూర్తిగా నయం అయ్యాయని దగ్గు కూడా గణనీయంగా తగ్గింది అని చెప్పారు. కానీ ఉదయం పూట అతనికి గొంతు అసౌకర్యం గానూ గొంతులో ఏదో వున్నట్లుగానూ బాధపడుతున్నారు. కొన్నిసార్లు తెల్లని చిక్కని కఫం బయటకు వస్తూ ఉండేది. అందుచేత పేషెంటును #1వ రెమెడీని TDS గా కొనసాగించమని సూచించడం జరిగింది.
మూడు వారాలు వాడిన తర్వాత కూడా స్థిరమైన మెరుగుదల కనిపించలేదు అందుచేత చికిత్సా నిపుణుడు తన యొక్క సీనియర్ వైద్య నిపుణులతో సంప్రదించి పేషెంటు నిర్మాణపు రంగంలో లో పని చేస్తున్నాడా అని అడగడం జరిగింది అతను అవునని చెప్పడంతో 13 జూలై 2018 న #1 ను మాన్పించి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.
#2. CC17.2 Cleansing + CC19.3 Chest infections chronic...TDS
ఈ రెమిడీ వలన వారం రోజుల్లోనే అతనికి 95 శాతం పెరుగుదల కనిపించింది. జులై 27 నాటికి నూరు శాతం ఉపశమనం కలిగింది. అందుచేత మోతాదును BD కి అనంతరం OD కి మార్చడం జరిగింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 17 నాటికి తన వ్యాధి లక్షణాలు ఏమాత్రం పునరావృతం కాకపోవడం చేత ఆ రోజు నుండి రెమిడీ తీసుకోవడం మాని వేయడం జరిగింది. అక్టోబర్ 2018 నాటికి పెషంటు ఎంతో విశ్వాసంతో పూర్వ ఇబ్బంది ఏమీ లేకుండా ఉత్సాహంగా ఉంటున్నారు.