నిద్రలేమి 03562...UK
60సంవత్సరాల మహిళ తన యొక్క నిద్రలేమి వ్యాధికి చికిత్స కోసం చికిత్సా నిపుణుడిని సంప్రదించింది. గత పది సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూ ఇన్ని సంవత్సరాలుగా ఆమె అల్లోపతి చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. పేషెంటు తనకు ఇంటివద్ద మరియు ఆఫీస్ లోను ఉన్నటువంటి ఒత్తిడి వలన ఈ నిద్రలేమి వచ్చినట్లుగా భావించారు. ఆమె ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల వరకు నిద్రకు ఉపక్రమింఛేది. నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా ఈమెకు రెండు మూడు గంటలే నిద్ర వస్తోంది. చాలా అరుదుగా నాలుగు గంటలు నిద్ర పోగలుగుతుంది. ఈ విధంగా అలోపతి మాత్రలు ఆమెకు ఏమాత్రం సహాయపడేవి కావు.
2018 జూన్ 26వ తేదీన ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC15.6 Sleep disorders... నిద్రించేందుకు అరగంట ముందు ఒక డోస్ ఆపైన అవసరాన్ని బట్టి ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున నాలుగు డోసులు వరకు తీసుకోవాలి.
ఈమె వైబ్రో గోళీలతో పాటు అలోపతి మందులు కూడా కొనసాగించారు. మూడు రోజుల తర్వాత తనకు కేవలము ఒక సింగిల్ డోస్ తోనే నూరు శాతం అద్భుతమైన నిద్ర పట్టినట్టుగా తెలిపారు. ఆ విధంగా ఏడు గంటల సేపు హాయిగా నిద్రించి ఉదయమే తన పనులకు ఉపక్రమించసాగారు. ఈ విధంగా నెలరోజులు వాడిన తర్వాత తన స్వయం నిర్ణయంతో అలోపతీ మందులు తీసుకోవడం మానివేశారు. అయినప్పటికీ ఆమె గాఢంగా నిద్ర పోగలుగుతున్నారు. ఆమె యొక్క శక్తి స్థాయిలు కూడా పెరిగినట్లుగా అనిపించసాగింది. ఈ విధంగా పునర్బలం పొందిన తర్వాత ఆమె అంతకుముందు తను చేయలేక నిర్లక్ష్యంగా వదిలివేసిన పనులను కూడా పూర్తి చేసుకోగలిగారు. సెప్టెంబర్ లో ఆమె రీఫిల్ కోసం వచ్చారు. అలాగే నవంబర్ 2018 నాటికి ఆమె మోతాదును OD కొనసాగిస్తూ ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నారు.