కర్ణిక కంపనము (ఏట్రియల్ ఫిబ్రిలేషన్) 02802...UK
70 సంవత్సరాల వ్యక్తి 2017 మార్చి 8వ తేదీన మొదటిసారి చికిత్సా నిపుణుడు వద్దకు వచ్చి తనకు రోజుకు అనేక సార్లు గుండె దడ ఏర్పడుతోందని చెప్పాడు. 2014 లో అతనికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (ఇది గుండె పై గదులలో ఏర్పడి కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది) అనే సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీని కారణంగా అతనికి చాలా చికాకుగా అసౌకర్యంగా ఇబ్బందిగా ఉంటుంది కానీ కారణం ఏమిటో తెలియరాలేదు. అతను మాట్లాడేటప్పుడు కూడా నెర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇతనికి రక్తపోటు కూడా ఉంది. దానికి మందులు కూడా వాడుతున్నారు.
చికిత్స నిపుణుడు క్రింది రెమిడీ ని 2017 మార్చి 7 వ తేదీన పేషెంటుకు ఇచ్చారు:
CC3.1 Heart Tonic + CC3.3 High BP + CC3.5 Arteriosclerosis + CC3.6Pulse irregular + CC3.7 Circulation + CC15.1 Mental and Emotional tonic + CC18.1 Brain disabilities…TDS
పేషెంటుకు మరునాటికల్లా తేలికగా ఉన్నట్లు అనిపించి ఆ తర్వాత రెండు వారాల వరకు అతనికి గుండె దడ రాలేదు. ఇతను తన యొక్క ఏట్రియల్ ఫిబ్రిలేషన్ విషయంలో నూరు శాతం ఉపశమనం పొందారు అయినప్పటికీ తనమోతాదును TDS గా కొనసాగించారు. చికిత్సా నిపుణుడు జూన్ 5 వ తేదీన పేషంటును చూసినప్పుడు మోతాదు OD కి తగ్గించారు. అనంతరం దీన్ని 2017 నవంబర్ 22 నుండి OW గా మార్చారు. 2018 నవంబర్ నాటికి పేషెంటు ఇదే మెయింటినెన్స్ డోస్ కొనసాగిస్తున్నారు.
2018 జూన్ 27న పేషెంట్ ఇచ్చిన వాంగ్మూలం: దాదాపు 5 సంవత్సరాల క్రితం నా ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. రాను రానూ పరిస్థితి మరింత దిగజారి నడవడం కూడా కష్టంగా మారిపోయింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టుగా చెప్పారు. నాకు యాంటీబయాటిక్స్ మరియు నీరు తగ్గడానికి టాబ్లెట్ లు ఇచ్చారు. ఫ్లూ తగ్గి పోయినప్పటికీ నాకు గుండె దడ ఏర్పడి నా హృదయస్పందన సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగిపోయింది. గత నాలుగైదు నెలలుగా ఈసీజీ మరియు ఎఖో కార్డియో గ్రామ్ వంటి పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం హృద్రోగ నిపుణులు నాకు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నట్లు చెప్పారు. ఇక దీంతో జీవితకాలం బాధపడాలి అని కూడా చెప్పారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వలన ఏర్పడినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో సాయి వైబ్రియానిక్స్ గోళీలు నాపై అద్భుత ప్రభావం చూపికేవలం కొద్దివారాలలోనే అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించి సాధారణ స్థాయిని కలిగించాయి.