ఫ్రోజెన్ షోల్డర్ (బిగిసుకుపోయిన భుజము) 02802...UK
54 సంవత్సరాల వైబ్రో చికిత్సా నిపుణురాలు మరియు ఫిజిషియన్ 2018 మే 6 వ తేదీ నుండి భుజంలో నొప్పి తో బాధ పడుతూ ఉన్నారు. మొదట నొప్పి తీవ్రంగా లేకపోవడంతో బహుశా ఎక్కువగా పని చేయడం వల్ల కలిగిందేమో అని ఆవిడ భావించి పట్టించు కోలేదు. తరువాత రెండు రోజుల్లో లో నొప్పి ఎంత తీవ్రమయ్యిందంటే తనకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అందు చేత ఆమె 2018 మే 8వ తేదీన తన దగ్గర ఎప్పుడూ ఉండే మూవ్ వెల్ రెమిడీ తీసుకున్నారు.
#1. CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…6TD
ఈ రెమిడి ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడలేదు అంతేకాక నొప్పి అంతకంతకు మరింత ఎక్కువ కాసాగింది. మే 10 నాటికి భుజాన్ని కదపటం కూడా చాలా కష్టమయింది. అందుచేత ఇది ఫ్రోజెన్ షోల్డర్గా ఆమె గుర్తించారు. డ్రైవింగ్ చేయడం డ్రెస్ వేసుకోవడం బ్రష్ చేసుకోవడం దువ్వెన తో తల దువ్వుకోవడం ఆఖరికి స్పూన్ నోట్లో పెట్టుకోవడం కూడా కష్టమైపోయింది. అటువంటి స్థితిలో ఆమె క్రింది రెమిడీ తయారుచేసుకుని వాడటం ప్రారంభించారు.
#2. CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…ప్రతి పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున 30 నిమిషాల వరకు ఆ తర్వాత 6TD
ఈ రెమిడీ ఎంత అద్భుతంగా పని చేసింది అంటే మరుసటి ఉదయానికి 50 శాతం రెండవ రోజు కి 90 శాతం మూడవ రోజు నూరు శాతం బాధ నివారణ అయ్యింది. దీనితో ఈ చికిత్సా నిపుణురాలు మోతాదును TDS గా 3 రోజులు, OD గా మరొక 3 రోజులు వాడి వారం లోపుగా మానివేశారు. ఇలా చేసి ఇప్పటికి 5 నెలలైనా నొప్పి పునరావృతం కాలేదు.