హైపోథైరాయిడ్ 11600...India
43 సంవత్సరాల మహిళకు ఏడు సంవత్సరాల క్రితం హైపో థైరాయిడ్ ఏర్పడినట్లుగా నిర్ధారణ చేయబడింది. ఆమెకు థైరాక్సిన్ రోజుకు 100 mg సూచించబడింది. ఒక సంవత్సరం తర్వాత ఆమెకు దురద, చర్మం పొడిబారటం, తలపోటు ఏర్పడ్డాయి. మామూలుగా డాక్టర్ కి చూపించుకోవడంలో భాగంగా మార్చ్ 2018 పరీక్ష చేయించగా టి ఎస్ హెచ్ విలువ 7.82 ఉన్నది (మామూలుగా ఇది 0. 13 నుండి 6.33 వరకు ఉండాలి). పేషంటు ప్రాక్టీషనర్ వద్దకు 2018 ఆగస్టు 3వ తేదీన వచ్చి క్రింది రెమిడి తీసుకొన్నారు.
CC6.2 Hypothyroid + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
పది రోజుల తర్వాత పేషెంట్ తనకు దురద, చర్మం పొడిబారటం, తలపోటు విషయంలో 20 శాతం మెరుగుదల కనిపించిందని చెప్పారు. నెల రోజుల తర్వాత వ్యాధి లక్షణాల విషయంలో 50 శాతం మెరుగుదల మాత్రమేకనిపించినప్పటికీ టి ఎస్ హెచ్ విలువ మాత్రం 1.24 కు అనగా సాధారణ స్థాయికి చేరింది. దీంతో పేషెంట్ ఎంతో సంతృప్తి చెంది స్వయం నిర్ణయంతో తను తీసుకుంటున్న థైరాక్సిన్ 100μg నుండి 50μg కి తగ్గించారు. అదే సమయంలో చికిత్స నిపుణుడు మోతాదును BD కి ఆ తర్వాత అక్టోబర్ 1 నుండి అనగా డాక్టర్ థైరాక్జిన్ తీసుకోవడం ఆపమని చెప్పిన నాటినుండి మోతాదును OD కి తగ్గించడం జరిగింది. అక్టోబర్ 28 తేదీన టి ఎస్ హెచ్ తిరిగి 5.04 చేరింది. దీంతో చికిత్స నిపుణుడు బహుశా అవసరమైన దానికంటే ముందే మోతాదు తగ్గించడం వలన ఈ సమస్య ఏర్పడిందేమో అని అని భావించి మోతాదును తిరిగి కొంత కాలంTDSకు పునరుద్ధరించడం జరిగింది.