సూర్య తాపము వలన ఏర్పడిన చర్మవ్యాధి 03567...USA
57 సంవత్సరాల మహిళ గత 35 సంవత్సరాలుగా సూర్య తాపం వలన కలిగిన చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె చర్మము ఎంత సున్నితంగా ఉండేదంటే కొంచెంసేపు ఎండ లో ఉన్నా చర్మం కమిలిపోయినట్లుగా అయ్యేది. ఇలా ఎండలో తిరిగినప్పుడు ఆమె చర్మం పై దద్దుర్లు ఏర్పడి రసిలాంటిది కారటం ప్రారంభమవుతుంది. దాంతోపాటు గుండె దడ కూడా ఏర్పడుతూ ఉండేది. ఆమె వ్యాధి ప్రారంభం అయినప్పటి నుండి కార్టికోస్టెరాయిడ్ క్రీములు డాక్టర్ సూచించిన విధంగా వాడుతూ ఉండేది. దానివలనకొన్నిరోజులకు దద్దుర్లు కొంచెం తగ్గినట్లు అనిపించేది. కానీ కొంచెంసేపు ఎండలో తిరగగానే తిరిగి ఏర్పడేవి.
అందుచేత ఆమె ఎండలోకి వెళ్లే ముందు డాక్టరు ఇచ్చిన క్రీం రాసుకొనివెళ్ళేది. దీనివలన ప్రారంభంలో ఉపశమనం కలిగేది కానీ రాను రాను పరిస్థితిమరింత అధోగతికి దిగజారింది. డాక్టర్లు ఇచ్చే మందుల వలన శాశ్వత పరిష్కారం ఏమీ లభించలేదు.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆమె ఉదయంపూట నడవడం మానేసింది. అలాగే బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు గొడుగు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే జాకెట్, కాళ్ళకు ప్యాంటు వంటివి తీసుకుని వెళ్ళడంతో పాటు తను ప్రయాణించే కారుకు సన్ రైజర్స్ కూడా ఏర్పాటు చేసుకుంది. ఇలా తన జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకుంది. అయినప్పటికీ ఫలితం లేకపోయేసరికి తాను అమితంగా ప్రేమించే తన ఉద్యోగాన్ని కూడా వదిలివేయాలని అనుకుంది. ఎందుకంటే ఆమె ఒక సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నందువలన మధ్యాహ్నం ఎండలో పిల్లలను ఆట స్థలానికి తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది కనుక ఉద్యోగాన్ని వదులుకోక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితిలో ఎండలో వెళ్ళవలసి వస్తే ఆమె వెడల్పైన టోపీ, పైన తెలిపిన ఆచ్ఛాదనలతో తన శరీరంపై ఏ మాత్రం సూర్యరశ్మి పడకుండా జాగ్రత్త పడుతూ బయటకు వెళ్ళేది. కానీ ఈ విధంగా వెళ్ళడం ఆమెకు ఎంతో అసౌకర్యాన్ని చిరాకును కలిగించేవి. ఆమెకు డాక్టర్లు యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఇచ్చారు. కానీ వాటిని ఆమె వాడలేదు. తను ప్రాక్టీషనర్ అయిన వెంటనే తనకు తానే వైద్యం చేసుకొని ఉపశమనం పొందారు.
27 జూన్ 2018 తేదీన ఆమె క్రింది రెమిడీ తనకోసం తయారు చేసుకున్నారు.
CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.3 Skin allergies + CC21.10 Psoriasis…QDS ఇదే రెమిడీని నీటిలో కలుపుకొని వ్యాధికి ప్రభావితమైన చర్మంపై కూడా రాసుకునేవారు. ప్రస్తుతం ఆమె డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్ క్రీమ్ మాత్రమే వాడుతూ ఉన్నారు.
వారం రోజులు తరువాత ఎండకు ప్రభావితమైన చర్మంలో 10 శాతం ఉపశమనం కనిపించింది. అయితే ఆమెకు తీవ్రమైన పుల్లౌట్ ఏర్పడి ఆమె చేతులను మంటలో వేసినంత బాధ కలిగింది. అయితే ఒక టవల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మంట ఏర్పడిన చర్మంపై మెల్లిగా రాస్తూ ఇంత బాధలో కూడా రెమిడీని QDS గా కొనసాగించారు. ఈ పుల్లౌట్ పది రోజులు ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మెల్లిగా తగ్గడం ప్రారంభించింది. అప్పటినుండి తన చర్మం వ్యాధినుంచి త్వరగా కోలుకోవడం ప్రారంభమైంది. చర్మంపై ఉన్న అసౌకర్యము దురద తొలగిపోయాయి. అలాగే దీంతో పాటుగా వచ్చే గుండెదడ కూడా మందులేవి వాడకుండానే తగ్గిపో నారంభించింది. ఒక అద్భుతం జరిగిన రీతిగా జూలై నెలలో ఆమె ఊహకు అందనంత వేగంగా వ్యాధి నయం అవ్వడమే కాకుండా ఆమె చర్మము సాధారణ స్థాయికి చేరుకుంది. జులై 30 నాటికి ఆమెకి 98 శాతం ఉపశమనం కలుగుగా మోతాదు BD కి తగ్గిం చడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఆమెకు 100 శాతం ఉపశమనం కలగడంతో మోతాదును ఆగష్టు రెండవ పక్షం నాటికి OD కి తగ్గించడం జరిగింది. సెప్టెంబర్ నాటికి ఆమె నిత్యకృత్యముల కోసం బయటకు రావడం ప్రారంభించారు.. ఆవిధంగా కొన్నినిమిషాలు బయట ఎండలో ఉన్నాకూడా ఆమెచ ర్మము ప్రభావితం కాకపోవడం గమనించారు. అయితే ఎక్కువ సమయం ఎండలో గడపవలసి వచ్చినప్పుడు ముందు జాగ్రత్తకోసం సన్ స్క్రీన్ ఉపయోగించడం, పొడుగుచేతుల జాకెట్, ప్యాంటు, గొడుగువంటివి తీసుకు వెళ్ళ డం మానలేదు. అలాగే స్టెరాయిడ్స్ వాడడం పూర్తిగా మానేసారు. అక్టోబర్ 2018 నాటికి ఈ రెమిడీని వాసన లేని క్రిముకు కలుపుకొని బాహ్యచర్మము పైన రాయడానికి OD గాకొనసాగించ సాగారు.
పేషంటువ్యాఖ్య :
37 సంవత్సరాలుగా డాక్టర్లు నయం చేయలేని వ్యాధిని స్వామి దయతో వైబ్రియానిక్స్ నయం చేసినందుకు కృతజ్ఞురాలిని.