ఇన్ఫ్లమేటరీ గ్లూకోమా 02799...UK
62 సంవత్సరాల మహిళ 2017 జూన్ నుండి కుడి కంటిలో వత్తిడి మరియు అస్పష్టమైన దృష్టితో బాధపడుతూ చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను కలిసారు. రెండునెలల క్రితం ఇన్ఫ్లమేటరీ గ్లూకోమా గా ఈ వ్యాధిని నిర్ధారించారు. దీని కోసం కంటిలో వేసే చుక్కలు, స్టెరాయిడ్లు (ఇవి కంటి నరాల పైన వత్తిడి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, దీనిని వాడడం తప్పనిసరి) వాడారు. అలాగే 2017 అక్టోబర్ 22 తేదీన శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. దీని ఫలితంగా కంటి దృష్టి మెరుగు పడింది. కానీ దురదృష్టవశాత్తూ వారం రోజులలోనే ఈమె ఎడమ కంటికి ఇదే సమస్య వచ్చింది. దీనిని గ్లూకోమా గా నిర్ధారించారు. దీని అనంతరం వాపు కూడా ఏర్పడింది. డాక్టర్లు యధావిధిగా కంటిలో చుక్కలు స్టెరాయిడ్లు ఇచ్చారు. వాపు నివారణ కోసం శస్త్ర చికిత్స తప్పనిసరి అని చెప్పారు. పేషంటు కంటిలో చుక్కలు తీసుకున్నారు కానీ స్టెరాయిడ్లు తీసుకోలేదు అలాగే ఆపరేషన్ చేయించుకోవడం కూడా ఈమెకు ఇష్టం లేదు. ఈ కంటి చుక్కలు తప్ప వేరే ఇతర ఆలోపతి మందులేవీ వాడడం లేదు. ఈమెకు 2017 డిసెంబర్ 22 న క్రింది రెమిడీ ఇవ్వబడింది
గ్లూకోమా నిమిత్తము :
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC7.1 Eye tonic + CC7.3 Eye infections + CC7.4 Eye defects + CC7.5 Glaucoma + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder + CC15.1 Mental & Emotional…QDS
వాపు నిమిత్తము :
#2. Prednisolone nosode…QDS
రెండు వారాల తరువాత ఆమెకు వత్తిడి మరియు దృష్టిలో 50%మెరుగనిపించింది. రెండు నెలల తరువాత అనగా 2018 మార్చి 3 వ తేదీన హాస్పిటల్ లో చూపించగా ఆమె ఎడమ కంటిలో వత్తిడి సాదారణ స్థాయిలోనే ఉందని నిర్ధారణ అయ్యింది. కనుక ఆమెకు శస్త్ర చికిత్స అవసరం లేదని ఐతే సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకుంటే చాలు అని చెప్పారు. పేషంటు ఈ విషయం చెప్పి తనకు నూరు శాతం తగ్గిపోయిందని చెప్పడంతో #1 మరియు #2 లను TDSకు తగ్గించడం జరిగింది. 2018 సెప్టెంబర్ 8 వ తేదీన పేషంటు కలిసినప్పుడు ఆమె చాలా ఆరోగ్యంగా కంటి దృష్టి మెరుగ్గా కనిపించడంతో #1 మరియు #2 లను BDకి తగ్గించడం జరిగింది. సమస్య పునరావృతం కాకుండా ఉండడానికి రెమిడీ లను దీర్ఘకాలము కొనసాగించాలని పేషంటు నిర్ణయించుకున్నారు.
సంపాదకుని వ్యాఖ్య: ప్రాక్టీషనర్ అవసరమైన దానికంటే అధికంగా రెమిడీ లను ఉపయోగించారు. ఉదాహరణకు #1 లో, CC4.2, CC7.4, CC10.1 మరియు CC13.1 అవసరం లేదు. ఈ చికిత్స వలన వ్యాధి తగ్గడానికి రెండు నెలలు పట్టింది. గతంలో ఇటువంటి వ్యాధికి (వార్తా లేఖ 2018 మార్చి ఏప్రిల్ సంపుటి 9 సంచిక 2) ఒక నెలలోనే పూర్తి నివారణ చేకూరింది. త్వరగా నివారణ చేకూరడానికి అవసరమైన నివారణులను మాత్రమే ఉపయోగించాలి అనేదానికి ఇది చక్కని ఉదాహరణ.