జువినైల్ అర్తెరైటీస్ 10355...India
2017 నవంబర్ 12 వ తేదీన 14 సంవత్సరాల అబ్బాయిని అతని తండ్రి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకొని వచ్చారు. ఈ అబ్బాయికి వ్రేళ్ళమధ్య పెద్ద పరిమాణంలో(10 మి.మీ) ఉన్న 7 బొబ్బలు ఉన్నాయి. మరియు బొటన వ్రేలి కీళ్ల మధ్య 2 బొబ్బలు ఉన్నాయి. ఇవి మొదటిసారి నెల క్రితం కనబడినప్పుడు చిన్నగా ఎరుపు రంగులో ఉన్నాయి. వీటి వలన అబ్బాయికి మంట మరియు దురద కూడా ఉంది కానీ ఇది భరించ దగినదిగానే ఉంది. బొబ్బల వలన కొంచం నొప్పి ఉంది కానీ వాటిని నొక్కితే నొప్పి భరించరానిది గా ఉంది. అతను వ్రాయడానికి పెన్ను పట్టుకోలేడు, మరియు బొటన వ్రేలు, వ్రేళ్లను కదపలేడు కనుక స్కూలుకు కూడా వెళ్ళడం లేదు. పేదరికం వలన తండ్రి అబ్బాయిని హాస్పిటల్ లో చూపించ లేకపోయాడు. ఐతే ప్రాక్టీషనర్ తన కుటుంబ డాక్టర్ ని సంప్రదించి ఈ వ్యాధి జువినైల్ అర్తెరైటీస్ అని నిర్ధారించారు
ఈ అబ్బాయికి రెండు సంవత్సరాల క్రితమే ఇటువంటి బొబ్బలు వచ్చాయని అవి చాలా చిన్నగా ఉండి ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని తండ్రి చెప్పాడు. అంతేకాక ఒక వారం తరువాత అవి మాయమవడంతో తండ్రి వాటిని గురించి పట్టించుకోలేదు.
ప్రాక్టీ షనర్ క్రింది రెమిడీ ఇచ్చారు.
CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…6TD
కేవలం నెల రోజుల లోనే అబ్బాయికి 60 శాతం మెరుగుదల కనిపించింది. నొప్పి మంట బొబ్బలు కొంచం చిన్నగా అయ్యాయి. దురద కూడా కొంచం తగ్గి వ్రేళ్లను కదప గలుగు తున్నాడు.రెండు నెలల లో పూర్తిగా తగ్గిపోయి సైకిలు మీద స్కూలుకు వెళ్ళడం కూడా ప్రారంభిoచాడు. ఇతే ప్రాక్టీషనర్ మోతాదును తగ్గించడం కుదరలేదు ఎందుకంటే అబ్బాయి తనకు పూర్తిగా తగ్గిపోవడంతో మరలా రాలేదు. అంతేకాదు అబ్బాయి ప్రతీ రోజు ఆనందంగా సైకిలు తొక్కుకుంటూ స్కూలుకు వెళ్ళడం చూస్తూ ప్రాక్టీషనర్ సంతృప్తి చెందుతున్నారు. ఈ విధంగా సంవత్సరం గడిచిపోయినా అబ్బాయికి సమస్యలేవీ పునరావృతం కాలేదు.