బహుళ సమస్యలు 02696...India
75-సంవత్సరాల మహిళ 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2018 ఫిబ్రవరి 11 వ తేదీన ప్రాక్టీషనర్ ను కలిసి తనను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న బహుళ సమస్యలు గురించి చెప్పారు. ఆమెకు తల తిరగడం సమస్య తో పాటు కొన్నిసార్లు మూర్ఛ పోవడం సమస్య కూడా ఉంది. అంటే కాక కాళ్ళకు విపరీతమైన తిమ్మిరి వీటివలన ఒక్కొక్కసారి రాత్రంతా మేలుకొని ఉండాల్సి వస్తోంది. ఈమెకు కీళ్ల నొప్పులు, తరుచుగా వచ్చే తిమ్మిరులతో పాటు వళ్లంతా విపరీతమైన దురదలు ఉన్నాయి. వీటితో పాటు గ్యాస్ట్రిక్ అనగా అసిడిటీ, మలబద్దకం, గ్యాస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నా వీరు ఆ బాధనంతా దిగమింగి చిరునవ్వు నవ్వుతూ ఉండడడం విశేషం. ప్రాక్టీషనర్ ఈమెకు క్రింది రెమిడీ లు ఇచ్చారు.
తల తిరగడం సమస్యకు:
#1. CC18.7 Vertigo…TDS
గ్యాస్ట్రిక్ సమస్యలకు:
#2. CC4.4 Constipation + CC4.10 Indigestion…TDS
దురదకు:
#3. CC21.3 Skin allergies…TDS
తిమ్మిరులు, మంట, కీళ్ల నొప్పులకు మరియు వెన్ను నొప్పికి:
#4. CC3.7 Circulation + CC20.3 Arthritis…TDS మరియు
#5. CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…TDS. పేషంటు చాలా దూరంలో ఉన్న కారణాన ఆమెకు 50 శాతం మెరుగయ్యాక ఈ రెమిడీ వాడవలసిందిగా సూచించడమైనది.
ప్రాక్టీషనర్ ప్రతీ సమస్యకూ పర్యవేక్షణ చేయడానికి వీలుగా ఉండే విధంగా వేరువేరు బాటిళ్ళ లో రెమిడీ ఇవ్వడం జరిగింది. పేషంటు ఎంతో భక్తితో ఈ రెమిడీలను స్వామిని ప్రార్ధిస్తూ తీసుకున్నట్లు తెలుసుకున్నారు.
నెల తరువాత పేషంటు తనకున్న అన్నీ సమస్యల విషయంలో 50% మెరుగుదల కనిపించిందని తెలిపారు. పేషంటు యొక్క కుమార్తె ఈ విషయం చెపుతూ తమ కిదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. పేషంటు #5 ను కూడా తీసుకోవడం ప్రారంభించారు.
నెల తరువాత తల తిరగడం, గ్యాస్త్రిక్ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. వంటి దురద, మంట విషయంలో చెప్పుకోదగిన మెరుగుదల కూడా కనిపించింది. మూడు నెలల తరువాత మోకాలు నొప్పి, నడుం నొప్పి మినహా మిగతా అన్నీ సమస్యలు పూర్తిగా మాయమయ్యాయి. కనుక #1 నుండి #3 వరకూ గల రెమిడీ లను OD కి తగ్గించి #4 మరియు #5లను …TDS గా కొనసాగించారు. పేషంటు కుమార్తె ప్రతీ నెలా రీఫిల్ కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదిస్తూ స్వస్తత నెమ్మదిగా నిలకడగా ఉందని కానీ పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం కూడా ఏర్పడిందని చెప్పారు.
సంపాదకుని వ్యాఖ్య: సాధారణంగా పేషంటుకు ఒకసారి 3 బాటిళ్ళ కన్నా ఎక్కువ ఇవ్వము. కానీ ఈ కేసు విషయంలో పేషంటు ఎంతో ప్రేరణ పొంది క్రమశిక్షణ తో ఉన్నారు కనుక సడలించడం అనివార్యం అయ్యింది.