ఆనెలు, పగుళ్లు 02696...India
55-సంవత్సరాల మహిళకు గత 20 సంవత్సరాలుగా కుడిపాదము అడుగుభాగంలో చర్మము కఠినముగా రాయి వలె ఉంటోంది. డాక్టర్లు దీనిని దీర్ఘకాలిక ఆనె అని నిర్ధారించారు. ఇంతకాలంగా బాధ ఎంత తీవ్రంగా ఉందంటే కుడికాలు పూర్తిగా క్రింద మోపడం, ముఖ్యంగా చెప్పుల్లేకుండా నడవడం దుర్లభంగా ఉంది. కనుక కాలును పక్కకి వంచి మెల్లగా నడవవలసి వచ్చేది. 2018 ఆగస్టు 5 వ తేదీన ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. SR299 Lycopodium CM…1 dose every 2 weeks, total 4 doses
#2. SR342 Antim Crud 200C…3TW for 4 weeks
#3. SR318 Thuja 30C…TDS for 5 days అనంతరం SR318 Thuja 200C… 1 రెండు వారాలకు ఒకసారి ఒక డోసు మొత్తం 2 డోసులు మాత్రమే.
పై నివారణాలన్నీ ఒకే రోజు ఒక్కొక్క దానికి 10 నిమిషాలు విరామంతో వేసుకోవడం ప్రారంభించారు. 15 రోజుల తరువాత పేషంటు ఎంతో ఆనందంతో నొప్పి లేకుండానే తన కుడికాలు క్రింద పెట్టగలుగుతున్నానని చెప్పారు. మందులు అలానే కొనసాగించడంతో 15 రోజుల తరువాత ఆనె 80 శాతం తగ్గగా నొప్పి మాత్రం పూర్తిగా తగ్గిపోయింది.
పేషంటుకు క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది:
#4. CC21.5 Dry Sores…TDS ఇలామూడు నెలలు తీసుకోవలసిందిగా సూచింప బడింది.
పేషంటు నెలకు ఒకసారి రిపోర్టు చేస్తూ తన పనిని తను చక్కగా చేసుకో గలుగుతున్నానని చెప్పారు. #4 ను TDS గా కొనసాగిస్తూ ఉన్నారు. ఆనె 100 శాతం తగ్గిపోగానే మోతాదు OD గా తగ్గించబడుతుందని ప్రాక్టీషనర్ తెలిపారు.
ప్రాక్టీషనర్ సూచనలు: పైన సూచించిన నివారణులు 2015 లో చికిత్సా నిపుణుడు తనపైననే ఉపయోగించుకొని విజయం పొంది ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆనెలతో ఇబ్బంది పడుతూ ప్రతీ సంవత్సరము నొప్పి పెరగసాగడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. పైన సూచించిన మోతాదులు #1 నుండి #3 వరకూ వాడడంతో సమస్య పూర్తిగా మాయమై పోయింది. ఇప్పటి వరకూ సమస్య పునరావృతం కాలేదు. సమస్య ఉన్న జాడ కూడా లేదు.
సంపాదకుని సూచన: 108CCబాక్సు ఉపయోగిస్తున్నట్లయితే CC21.5 Dry Sores ఇవ్వడం మంచిది. ఎందుకంటే దీనిలో అవసరమైన ఇతర నివారణులు అన్నీ ఉన్నాయి. ఇటువంటి ఇతర సమస్యలకు ఈ రెమిడీ ని QDS మోతాదులో పూర్తి నివారణ చేకూరే వరకూ వాడడం మంచిది.