వెన్ను నొప్పి, సక్రమంగా రాని ఋతుక్రమము 11595...India
2018, ఫిబ్రవరి 28 వ తేదీన 35 సంవత్సరాల మహిళ గత ఆరు సంవత్సరాలుగా వెన్ను నొప్పి తో బాధపడుతూ ప్రాక్టీషనర్ ను కలిసారు. ఈ నొప్పి వెనుక నుండి ముందుకు వ్యాపిస్తూ ఎడమ మోకాలు వరకూ సూదితో గుచ్చినట్లు ఉంటోంది. ఈ నొప్పి సాయంత్రానికి మరీ ఎక్కువవుతుంది. పేషంటు ఈ నొప్పికి కారణం మోటార్ సైకిల్ మీద ప్రతీ రోజు తను ఎక్కువదూరం ప్రయాణం చేస్తున్నందుకు కలిగిందేమో అని భావించారు. ఈమెకు మరొక సమస్య ఏమిటంటే యుక్తవయసులో ఋతుక్రమం మొదలైనప్పటినుండి అది సక్రమంగా రాని చరిత్ర కూడా ఉన్నది. మరీ ఆలస్యమైన సందర్భంలో అలోపతి మందులు వేసుకొనేవారు. ఇటీవలే పేషంటుకు మెడవాపు తో పాటు గర్భాశయం లో కణుతులు ఉన్నట్లు రిపోర్టు ద్వారా తెలిసింది. పేషంటు అలోపతి మందుల ద్వారా ఫలితం కలగక పోవడంతో వాటిని ఆపి వైబ్రో మందులు స్వీకరించారు.
వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC15.1 Mental & emotional tonic + CC20.1 SMJ tonic + CC20.5 Spine + CC20.7 Fractures...TDS నీటితో
వారం తర్వాత పేషంటుకు వెన్నునొప్పి విషయంలో స్వల్పంగా నొప్పి పెరిగింది (బహుశా పుల్లౌట్ కావచ్చు). ఐతే రెండువారాల తర్వాత ఈ వెన్నునొప్పి విషయంలో 80% మెరుగుదల కనిపించింది. అంతేకాకుండా ఋతుక్రమం కూడా సక్రమంగా రావడం ప్రారంభమయ్యింది. మూడు వారాల తరవాత అనగా 20 మార్చి 2018, తేదీన వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిపోయినట్లు ఆమె తెలిపారు. కనుక డోసేజ్ ను BD కి తగ్గించడం జరిగింది. మరో రెండు వారాల తర్వాత ఈ డోసేజ్ OD కి తగ్గించడం జరిగింది.
2018 ఆగస్టు నాటికి పేషంటు, రెమిడి ని OD మెయింట్ నెన్స్ డోసేజ్ గా తీసుకుంటూ ఉన్నారు. పేషంటుకు వ్యాధి లక్షణాలేవీ పునరావృతం కాలేదు. గత 6 నెలలుగా వీరికి ఋతుక్రమం కూడా సక్రమంగా వస్తోంది.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య:
CC20.7 Fractures అనే రెమిడి పేషంటు బైక్ మీద వెళ్ళేటప్పుడు సుమారు గంట ప్రయాణం చేయవలసి ఉంటుంది కనుక కుదుపులు ద్వారా నడుమునొప్పి పెరగకుండా ఉండడానికి ఇవ్వబడింది.