కిడ్నీలో రాళ్లు, జుట్టు రాలిపోవడం 03522...Mauritius
27 సంవత్సరాల వ్యక్తి 27 మే 2015, న ప్రాక్టీషనర్ ను కలిసారు. గత రెండు సంవత్సరాలుగా వీరు వెన్ను నొప్పితో బాధ పడుతూ ఉన్నారు. గత 6 నెలలుగా ఈ నొప్పి మరీ తీవ్రంగా ఉండటo వల్ల తన రోజు వారి పనుల మీద ప్రబావం చూపింది. స్కానింగ్ ఫలితాలు ఇతనికి మూత్ర పిండాలలో రాళ్లు ఉన్నట్లు తెలిపాయి కనుక వీరిని లితోట్రిప్సీ (కిడ్నీ లో రాళ్ళను పగలగొట్టడానికి వాడే అల్ట్రాసౌండ్ విధానము) కోసం వెయిటింగ్ లిస్టు లో ఉంచారు. వీరు నొప్పి నివారణలను తప్ప మరే ఇతర మందులు వాడలేదు. ఈ పేషంటు గత రెండు సంవత్సరాలుగా అజీర్ణం, అసిడిటీ తో బాధ పడుతూ ఉన్నారు. ఇంకా వీరికి గత 5 నెలలుగా చుండ్రు మరియు జుట్టు రాలిపోయే సమస్య కూడా ఉన్నది. తల పైన బట్టతల మాదిరిగా అక్కడక్కడా ఏర్పడడం చూసి వీరికి మరింత ఆందోళన పెరిగింది. దీనికోసం చుండ్రు నివారించే షాంపులను, ఆయుర్వేదం నూనెలు మరియు విటమిన్ సప్లిమెంటులను కూడా ప్రయత్నించారు కానీ ఏవీ ఉపయోగ పడలేదు. వీరికి ప్రాక్టీషనర్ క్రింది రెమెడి ఇచ్చారు:
కిడ్నీలో రాళ్లు, అజీర్ణము మరియు అసిడిటీ కొరకు:
#1. CC4.10 Indigestion + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS
జుట్టు రాలిపోవడం మరియు చుండ్రు సమస్యలకు:
#2. CC11.2 Hair tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections …TDS
నెల రోజుల తరవాత వెన్ను నొప్పి విషయంలో 50%, అసిడిటీ, అజీర్ణ సమస్యల విషయంలో 80% ఉపశమనం లభించింది కానీ జుట్టు రాలిపోయే విషయంలో ఏమాత్రం ఫలితం కనబడలేదు. రెండు నెలల తరవాత జుట్టు రాలిపోవడం, చుండ్రు విషయంలో 40% ఉపశమనం లభించింది.
మూడు నెలల తర్వాత వెన్ను నొప్పి, అసిడిటీ, అజీర్ణం, పూర్తిగా మాయమయ్యాయి. అంతేకాక 30 ఆగస్టు 2015 తేదీన తీయించుకున్న ఎకోగ్రఫీ లో కిడ్నీ లో రాళ్లు పూర్తిగా మాయమయినట్లు రిపోర్టు వచ్చింది. పేషంటుకు 100% ఉపశమనం లభించడంతో ప్రాక్టీషనర్ #1 ను OD కి తగ్గించడం జరిగింది. ఈ విధంగా నెల రోజులు వాడి 1 అక్టోబర్ 2015 రెమిడి పూర్తిగా మానివేశారు. ఐతే #2 ను మాత్రం మరో 3 నెలలు కొనసాగించారు.
30 డిసెంబర్ 2015 తేదీన అనగా చికిత్స మొదలుపెట్టిన ఏడు నెలల తరువాత ప్రాక్టీషనర్ పేషంటును కలుసుకొన్నప్పుడు గుర్తుపట్టడానికి కూడా కష్టంగా ఉండేలా పేషంటు లో మార్పు వచ్చింది, వీరి జుట్టు నమ్మశక్యంగా పెరగడమే కాక చుండ్రు సమస్య పూర్తిగా మాయమయ్యింది. కనుక #2 ను మరొక నెల రోజులు OD గా కొనసాగించి అనంతరం మానివేశారు.