ప్రోస్టేట్ వాపు 11589...India
63 సంవత్సరాల వ్యక్తికి గత రెండు సంవత్సరాలుగా ఎక్కువసార్లు మూత్రం జారీ అవడమే కాక ఇది కష్టంగానూ నొప్పితో కూడి ఉంటోంది. దీనితో పాటు గత నాలుగు నెలలుగా వీరి పాదాలకు వాపు కూడా వస్తోంది. ప్రతీ రాత్రి 4 నుండి 5 సార్లు మూత్రం కోసం లేవవలసి వస్తోంది. ఇలా లేచిన ప్రతీ సారి మూత్ర విసర్జన కోసం15 నిముషాలు పడుతోంది ఎందుకంటే మూత్రా శయంలో ఇంకా మూత్రం ఉందనే భావన వీరికి ఉంటోంది. వీరికి ప్రోస్టేట్ వాపు ఉంది కనుక ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు నిర్ణయించారు.
దీనిని తప్పించుకొనే నిమిత్తం పేషంటు 21 జూలై 2017, తేదీన వైబ్రో ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్లారు వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC13.1 Kidney & Bladder tonic + CC13.2 Kidney & Bladder infections + CC14.2 Prostate + CC20.4 Muscle & Supportive tissue…TDS నీటిలో
4 రోజులు మందులు వేసుకున్న తరువాత పేషంటుకు మూత్ర విసర్జన సమయంలో నొప్పి తక్కువగా ఉన్నట్లు తెలిసింది. 2నెలలు వాడిన తరువాత రాత్రిపూట మూత్ర విసర్జన ఒక్కసారి మాత్రమే వెళ్ళసాగారు. నొప్పి కూడా చాలా వరకూ తగ్గింది. కనుక ప్రోస్టేట్ ఆపరేషను వాయిదా వేశారు. #1 ను ఇప్పుడు ODకి తగ్గించడం జరిగింది.
మరొక నెల తరువాత పేషంటు మూత్రజారీ సమయము తక్కువ కావడమే కాక మూత్ర విసర్జన లో నొప్పికూడా తగ్గడంతో ప్రాక్టీషనర్ కొంబో ను క్రింది విధంగా మార్చడం జరిగింది:
#2. CC13.1 Kidney & Bladder tonic + CC14.2 Prostate…3TW
తరువాత ఐదు నెలలలో డోసేజ్ క్రమంగా 2TW కు చివరగా OW కు తగ్గించడం జరిగింది. ఐనప్పటికీ పేషంటు మంచినీరు ఎక్కువ త్రాగితే ఇతని కాళ్ళల్లో కొంచెం వాపు వస్తోంది. జూలై 2018, నాటికి పేషంటుకు వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాకుండా ఆనందంగా ఉన్నారు.
సంపాదకుని వ్యాఖ్య: వాపు వచ్చినప్పుడు CC3.1 Heart tonic ను వేస్తే ఇది రక్తప్రసరణ ను పెంచి వాపును తగ్గిస్తుంది.