క్రోన్స్ వ్యాధి 03564...Australia
17డిసెంబర్ 2017, తేదీన 57-సంవత్సరముల వ్యక్తి తాను గత 4 సంవత్సరములుగా అనుభవిస్తున్న క్రోన్స్ వ్యాధికి చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఈ వ్యాధి వలన కడుపునొప్పి, రోజుకు కనీసం 6 సార్లు విరోచనాలు అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ రోజూ వీరికి మలవిసర్జన సమయంలో రక్తస్రావం అవుతోంది. వీరు పాలఉత్పత్తులను పూర్తిగా తీసుకోవడం మానివేశారు ఎందుకంటే వాటివలన కడుపునొప్పి ఎక్కువై పోతోంది. అనేక సంవత్సరాలుగా వీరు అలోపతి మందు పైరాలిన్ (Pyralin EN) 500mg రోజుకు రెండు సార్లు వేసుకుంటున్నారు కానీ ఫలితం ఉండడం లేదు. ఐనప్పటికీ వైబ్రో రెమిడితో పాటు దానిని కొనసాగించారు. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC4.2 Liver & Gallbladder + CC4.5 Ulcers + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.11 Wounds & Abrasions…QDS
12 రోజులపాటు వైబ్రో మందులు తీసుకున్న తరువాత పేషంటుకు కడుపునొప్పి, విరోచనాలు, మలంలో రక్తస్రావం తగ్గిపోయాయి, కానీ ఈ మెరుగుదల అనేది 70%వరకూ ఉంటుందని అంచనా వేసారు. ఎందుకంటే పాలపదార్ధాలు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందనేది వీరికి ఇంకా నిర్ధారణ కాలేదు. ఐనప్పటికీ డోసేజ్ ను TDS.కు తగ్గించారు.
మరో రెండు నెలలు రెమిడి వాడిన తరువాత అనగా 2018 మార్చి9వ తేదీన పేషంటు తనకు 90% మెరుగుదల చేకూరిందని చెప్పారు. ఐనప్పటికీ పాల ఉత్పత్తుల పట్ల వీరి భయం అలాగే ఉంది. ప్రాక్టీషనర్ పేషంటుకు ఇచ్చే కొంబోకు అదనంగా దుష్ప్రభావ నిర్మూలన కోసం CC17.2 Cleansing ను కలిపారు.
ఆ తరువాత వ్యాధిలక్షణాలు కనిపించకపోవడంతో 27 ఏప్రిల్ 2018 న డోసేజ్ ను మూడునెలల వరకూ BD గానూ ఆ తరువాత మెయింటనెన్స్ డోస్ ODగా తీసుకోవలసిందిగా సూచించడం జరిగింది. పేషంటు తనకు పూర్తిగా నయమవడం వలన 23 మే 2018 నుండి పైరలిన్ (Pyralin EN) 500mg తీసుకోవడం మానేశారు. జూన్ 2018 నుండి పేషంటు పాల ఉత్పత్తులు కూడా తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కానందున ఆనందంగా ఉన్నారు.