వాడిపోయే మొక్కలు 03564...Australia
25 నవంబర్ 2017న పుట్టపర్తిలో AVP గా శిక్షణ పూర్తిచేసుకొని ఆస్ట్రేలియాకి తిరిగి వచ్చిన వెంటనే ఈ ప్రాక్టీషనర్ తన ఇంట్లో వాడిపోతూ ఉన్న తులసి మొక్కకు చికిత్స చేయడం ప్రారంభించారు. (ఫోటోను చూడండి). నెలలోపులోనే మొక్క తాను అనుకున్న దానికంటే మెరుగ్గా ఎదగడం ఆనందాన్నిచ్చింది. ఈ స్పూర్తితో తన తోటలో ఉన్న టమాటా మరియు కొత్తిమీర మొక్కలకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వీటిని తన తోటలో పెంచడం సాధ్యం కావడం లేదు. అనేక సందర్భాల్లో మట్టిని మార్చడం, రకరకాల ఎరువులను ప్రయత్నించడం ఇలా ఎన్ని చేసినా ఈ మొక్కలు సన్నగా వడిలి పోయినట్లు ఉండి తరువాత చనిపోతున్నాయి.
1 జనవరి 2018 న ప్రాక్టీషనర్ ఒక చుక్క CC1.2 Plant tonic తో చక్కెర గోళీలు తయారుచేసి మూడు గోళీలు వేడిచేసి చల్లార్చిన 100 ml నీటిలో వేసారు. ఈ నీటిని 1 లీటరు నీరు ఉన్న బాటిల్ లో వేసారు. ఒక కప్పు నీటిని తులసి, కొత్తిమీర, టమాటా మొక్కలకు వారానికి మూడు సార్లు ఇచ్చారు. 5 రోజుల తర్వాత మొక్కలు చాలా వేగంగా పెరుగుతున్నట్లు గమనించారు. వేసవిలో బాగా వేడి ఉన్నప్పటికీ మొక్కలకి ప్రతీ రోజూ నీళ్ళు పోసేవారు.
2018 ఫిబ్రవరి నెలలో మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు (చికిత్సకు ముందు, వెనుక ఉన్న ఫోటోలు చూడండి). టమాటా మొక్కలు పూలు పూసి పిందెలు వేయడం ప్రారంభమయ్యింది. కొత్తిమీర తులసి కూడా చాలా చక్కగా పెరుగు తున్నాయి. ఈ ఫలితాలను చూసి ఎంతో ఆనందించి పూల మొక్కలు, కూరగాయల మొక్కలూ కూడా పెంచడం ప్రారంభించారు.