టమాటా ముక్కల నుండి టమాటాల ఉత్పత్తి 11520...India
ఒక తాజా టమాటా పండు నుండి కోసిన రెండు ముక్కలనుండి ( ప్రక్కన ఉన్న బొమ్మ చూడండి) టొమాటో మొక్కలను పెంచే ప్రయోగము నిర్వహింప బడింది.
చక్రాల మాదిరిగా కోసిన రెండు టమాటా ముక్కలను రెండు ఖాళీ గిన్నెలలో ఉంచాలి. ఒక గిన్నెలో సాధారణ నీటిని చల్లాలి. రెండవ దానిలో CC1.2 Plant tonic…TDS. తో చార్జ్ చేయబడిన నీటిని చల్లాలి. 5 రోజుల తర్వాత ఈ ముక్కలను CC1.2 Plant tonic + 15.1 Mental & Emotional tonic + 18.1 Brain disabilities.తో చార్జ్ చేయబడిన మట్టి కుండలలోనికి మార్చబడినవి. రెమిడి నీటిని చల్లడం OD కి తగ్గించి ప్రయోగం పూర్తయ్యే వరకూ కొనసాగింప బడింది.
35 రోజుల తర్వాత ఈ కుండీలలో చిన్న చిన్న ఆకులు కనిపించాయి. ఇప్పుడు కుండీలను బయట నేరుగా సూర్యకాంతి పడకుండా ఉండటానికి నీడకు ఉంచడం జరిగింది. ఆ తరువాత రెండు నెలలోనే మొక్క వేగంగా పెరిగి 95 వ రోజుకల్లా ప్రాక్టీషనర్ కుటుంబమంతా పండిన టమాటాలు కోసుకునే స్థాయికి ఎదిగింది. క్రింద ఇచ్చిన ఫోటోలు టమాటా మొక్క క్రమంగా ఎదిగిన తీరును వివరిస్తాయి.
55 రోజుల తర్వతా చక్కగా ఎదిగిన ఆరోగ్యకరమైన మొక్కను పై ఫోటోలో చూడవచ్చు. 75 రోజుల తర్వాత టమాటా పిందెలు, 80 రోజులకు పచ్చని టమాటాలు, రావడం చూడవచ్చు. 85 ఆ రోజు నుండి టమాటాలు బాగా పండి రంగు వచ్చాయి. ప్రస్తుతం ఈ టమాటాలు ఎన్నో పక్షులను ఆకర్షించ సాగాయి.
రెండవ కుండీలో ఉంచిన టమాటా ముక్క 39 రోజుల తర్వాత కూడా ఏ మార్పు లేకుండా పాడయిపోవడంతో పారవేయడం జరిగింది.
ఈ ప్రాక్టీషనర్ గతంలో నిమ్మవిత్తనం నుండి మొక్కను పెంచిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె చేసిన ఈ ప్రయోగం ఆమెకు ఎంతో సంతృప్తిని ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఈ ప్రయోగం ఇచ్చిన స్పూర్తితో వీరు నిత్యం ఉపయోగించే కూరగాయల వంటివి అనగా ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ఆలూ, నిమ్మ, గుమ్మడి, చిక్కుడు, ఓక్రా వంటివి విత్తనాలు కొనవలసిన అవసరం లేకుండానే తన పెరడులో ఉత్పత్తి చేయసాగారు.