దీర్ఘకాలిక సైనుసైటిస్ వ్యాధి 11590...India
45 సంవత్సరాల వ్యక్తి ఒక సంవత్సరం నుండి సైనుసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. వీరికి పదేపదే ముక్కు కారుతూ ఉండడం, వారము రోజులు వదలకుండా దుర్వాసనతో కూడిన ద్రవం కారడం, ఇలా ప్రతీనెలా పునరావృతమవుతూ ఉండేది, ముఖ్యంగా శీతాకాలంలో ఇది మరీ ఎక్కువగా ఉండేది. గత సంవత్సరం 8 సార్లు ఈ విధంగా ఇబ్బంది పడ్డారు. వీరికి మరొక సమస్య కూడా ఉంది. వాతావరణం చల్లగా ఉన్నా, శీతల పానీయములు వంటివి త్రాగినా సైనస్ తలపోటు భరించలేని విధంగా వస్తూ ఉంటుంది. వీరు అలోపతి మందులు ఎప్పుడూ వాడలేదు కానీ హొమియోపతీ మందులు రెండునెలలు వాడడంతో 20 శాతం మెరుగుదల కనిపించింది. ఐతే వీరు దానిని ఎక్కువ ఖరీదు దృష్ట్యా కొనసాగించలేక పోయారు. దీని బదులుగా వీరు వైబ్రో రెమిడిలు తీసుకో దలచి 27నవంబర్ 2017 తేదీన వైబ్రో ప్రాక్టీషనర్ ను సంప్రదించగా వీరికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…TDS
పేషంటుకు చల్లని పదార్ధాలు, శీతల పానీయములు, ఐస్క్రీం వంటి వాటికి దూరంగా ఉండమని సలహా ఇవ్వబడింది. నెల రోజుల తరువాత పేషంటుకు తలపోటు, ముక్కు కారడం విషయంలో 50% ఉపశమనం కలుగగా ముక్కునుండి వచ్చే దుర్వాసనతో కూడిన ద్రవం కారడం 100% తగ్గిపోయింది. జనవరి 2018, నాటికి వ్యాధి లక్షణాలన్నింటి నుండి 100% ఉపశమనం కలిగింది. నిజం చెప్పాలంటే అదే నెలలో పేషంటు 3°C, ఉష్ణోగ్రత ఉండే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా ఇతనికి సైనస్ వంటి సమస్య లేమి లేకుండా సౌకర్యవంతంగా ఉంది. ఫిబ్రవరి 2018, నాటికి ఇతనికి ఒక్కసారి మాత్రమే ముక్కుకారడం, తలపోటు సమస్య ఏర్పడ్డాయి, అవికూడా రెండు రోజులు ఉండి తగ్గిపోయాయి. ఐతే రానున్న శీతాకాలంలో రిస్కు లేకుండా ఉండడానికి రెమిడి ని TDS గా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జూన్ 2018 వరకూ ఈ నాలుగు నెలలలో ఈ సమస్య పునరావృతం కాకుండా పేషంటు ఆనందంగా ఉన్నారు.