మలబద్దకం, అజీర్ణం & ఈతకల్లు (కాoడిడా) 11966...India
ఆగష్టు15, 2014న, 2½ సం.ల వయసున్న ఒక బాలుడు గత 1½ సం.లుగా దీర్ఘకాలిక మలబద్ధకం, అజీర్తితో బాధపడుతూ చికిత్సకోసం తీసుకురాబడ్డాడు. అతను కడుపునొప్పితో దాదాపు ప్రతిరాత్రి మధ్యలో నిద్రలేస్తూ ఏడుస్తున్నాడు. తల్లిదండ్రులు అలోపతి వైద్యాన్ని2సార్లు ప్రయత్నించారు. కాని బాధ తగ్గలేదు. అతనికి 200 ml నీరు (ప్రతి కాంబో ఒక డ్రాప్) లో చేసిన మందుకాంబో ఇచ్చితిమి:
#1. CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.2 Child tonic…TDS
3రోజుల చికిత్సతో, మలబద్ధకం, అజీర్తి పోయాయి. చికిత్సకు మునుపు బాలుడు అతిగా చాక్లెట్లు బిస్కెట్లు తినేవాడు. అందువలన అతని ఆహారంలో మార్పులు చేశారు. బిస్కెట్లు అతనికి ఇవ్వకుండా అతని ఆహారంలో చక్కెర తగ్గించి, అదే మోతాదుతో వైద్యం జరిగింది. కొద్ది నెలలుగా శిశువు మలరంధ్రం చుట్టూ శిలీంధ్రవ్యాధి (ఫంగల్ ఇన్ఫెక్షన్ )వ్యాపించి, 2" బొబ్బ తరచుగా కనిపించేది. ప్రాక్టీషనర్ శరీరప్రేగుల శిలీంధ్రవ్యాధి అదుపుకోసం మిశ్రమం క్రింది విదంగా మార్పు చేసినారు:
#2. Combo #1 + CC12.2 Child tonic + CC17.2 Cleansing + CC21.7 Fungus…TDS
నీటిని కూడా 200 ml నుండి 400 ml వరకు పెంచారు. 2-3 రోజుల తరువాత శిలీంధ్ర సంక్రమణ, 2వారాల తరువాత చర్మవ్యాధి కూడా సంపూర్తిగా నయమైనవి.