వారికోజ్ వీన్స్ (సిరుల ఉబ్బు) 03552...Qatar
44 ఏళ్ల అభ్యాసకుడు గత 5 సంవత్సరాలుగా నరాల ఉబ్బుతో బాధపడుతున్నారు. రెండు కాళ్లలో ఉబ్బిన సిరలు కనిపిస్తున్నప్పటికీ ఎడమ కాలులో మరింత ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. అతను కొన్ని నిమిషాలు జాగింగ్ చేసినా లేదా వేగంగా నడిచినా తీవ్రమైన నొప్పి వస్తోంది. దీనికోసం వీరు ఏ విధమైన ఇతర చికిత్సలు తీసుకోలేదు.
2016 ఆగస్టు 13న, పేషంటుకు ఈ క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia…TDS
రెమిడి ప్రారంభించిన మరుసటి రోజు అతని ఛాతీ యొక్క ఎడమ వైపు చర్మము పైన ఎర్రని దద్దుర్ల రూపంలో పుల్లౌట్ కనిపించింది. ఏ చికిత్స లేకుండా మూడు రోజుల తరువాత ఇది అదృశ్యమయ్యింది. రెండు వారాల తరువాత కాలి నొప్పి 25% తగ్గింది, అయితే రెండు కాళ్లపై ఉబ్బులు క్రమంగా తగ్గసాగాయి. మరొక రెండు వారాల తరువాత అనగా 10 సెప్టెంబరు 2016న రెండు కాళ్ళలో నొప్పి పూర్తిగా అదృశ్యమయ్యింది; కుడి కాలులోని ఉబ్బు కూడా గణనీయంగా తగ్గింది. ఇంకొక రెండు వారాల తరువాత, కుడి కాలులోని అనారోగ్యపు బొబ్బలు పూర్తిగా అదృశ్యమయ్యాయి మరియు ఎడమ కాల్లో ఉన్నఉబ్బు తగ్గడం ప్రారంభమయ్యింది. ఈ మోతాదు రెండు వారాలు BD గా మరియు మరో రెండు వారాలపాటు OD గా తగ్గించబడింది. 2016 అక్టోబరు మధ్యకాలంలో, ఎడమ కాలు మీద సిరల ఉబ్బుకు సంబంధించిన చర్యాశీలత ఇంకా కనిపిస్తున్నప్పటికీ, అభ్యాసకునకు దీనివలన అసౌకర్యం ఏమాత్రం కలగడం లేదు. ఇవి కేవలం ఉపరితలం మీద మాత్రమే ఉన్నందున తగిన సమయంలో వాటంతట అవే అదృశ్యమవుతాయని భావించారు. ప్రాక్టీషనర్ రెమిడి తీసుకోవడం నిలిపివేసినప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగా ఉంది.