మెడ మరియు భుజాల నొప్పి 11587...India
6 నెలల క్రితం 48-సంవత్సరాల మహిళ ప్రమాదవశాత్తూ రిఫ్రిజిరేటర్ను గుద్దుకొనడం వలన క్రిందపడి ఆమె మెడకు గాయం అయ్యింది. ఆమె మెడ, భుజాలు విపరీతంగా నొప్పి పుట్టడంతో పాటు ఈ నొప్పి క్రమంగా వీపు క్రిందికి కూడా చేరింది. మెడికల్ రిపోర్ట్ లో వీపు మరియు నడుముల వద్ద ఎముకల అమరిక, ఎత్తు, సాంద్రత అంతా సరిగానే ఉంది. ఐతే C4-C5 మరియు C5-C6 డిస్కుల అమరికలో సాధారణంగా ఉండవలసిన ఖాళీ కన్నా కొంచం తగ్గుదల, ఏర్పడింది. అలాగే వీటి మధ్య ఉండే మెత్తని కణాలు దెబ్బతిన్నట్లు గానీ వాపుగానీ ఉన్న దాఖలా కూడా ఏమీలేదు. ఈమె సాధారణ నొప్పి నివారణ గోళీలు తప్ప ఏమీ వేసుకోలేదు దానివలన ఫలితం కూడా ఏమాత్రం కలగలేదు. 28 జూలై 2017,న ప్రాక్టీషనర్ ను కలిసే సమయానికి ఈమె విపరీతమైన నొప్పితో బాధపడుతూ సాధారణ గృహకృత్యాలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.5 Spine + CC20.7 Fractures…6TD
కేవలం రెండు వారాలలోనే అనగా 6 ఆగస్టు 2017, నాటికి ఆమెకు మెడ, భుజాలు, మరియు వెన్నుకు సంబంధించి 60% ఉపశమనం కలిగింది. అందువలన మోతాదును TDS కు తగ్గించడం జరిగింది. మరొక వారం తరువాత నొప్పి విషయంలో మరొక 25% ఉపశమనం కనిపించింది. వైబ్రో మందులు ప్రారంభించిన నెల రోజులలోనే ఆమె పూర్తిగా కోలుకొని తన గృహకృత్యాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరొక రెండు వారాల వరకూ మోతాదును క్రమంగా OW కి తగ్గించడం జరిగింది. పేషంటు ఈ మోతాదును మెయింటెనెన్స్ మోతాదుగా కొనసాగించారు.19 జనవరి 2018, నాటికి నొప్పి పునరావృతం కాక పోవడం వలన ఆమె ఆనందంగా ఉన్నారు.