క్యాన్సర్ నొప్పి 03533...UK
అభ్యాసకురాలు అనారోగ్యంతో అంతిమ దశలో ఉన్న తన 82 సంవత్సరాల ఆంటీని 9 నవంబరు 2015 న సందర్శించారు. రెండు సంవత్సరాల క్రితంనుండి ఆంటీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిసింది; ఏదేమైనా, ఆమె కుటుంబం ఆమె వయస్సు మరియు బలహీనత కారణంగా ఏ వైద్య సహకారాన్ని కోరుకోలేదు. అక్టోబర్ మధ్యకాలంలో, అధిక నొప్పి కారణంగా, రోగిని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ ఆమెకు మత్తుమందు ఆధారిత నొప్పినివారిణిని ఇచ్చారు. ఇది ఆమె పరిస్థితిని మరింత విషమింప జేయడంతో ఆమె ఒక స్ట్రెచర్లో తిరిగి ఇంటికి తీసుకురాబడింది. ఆసుపత్రికి వెళ్లడానికి ముందు ఆమె సంపూర్ణంగా తెలివితో ఉన్నారు. ఇప్పుడు ఆమె అపస్మారక స్థితి లోనికి చేరుకొని కళ్ళు తెరవడమే కష్టమైపోయింది. ఆమె మంచానికే పరిమిత మైపోయి, మాట లేక అవిశ్రాంతంగ కనీసం పక్కకి తిరగడం కూడా లేకుండా నొప్పితో మూలుగుతూ ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంది. కనీసం ద్రవపదార్ధాలు కూడా త్రాగలేని పరిస్థితి. ఈమె కోసం కుటుంబమంతా జాగరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కనీసం నొప్పి తెలియకుండా ఉండటానికి కూడా ఏమీ ఇవ్వలేని పరిస్థితి.
ఈ స్థితిలో ప్రాక్టీషనర్ క్రింది కాంబోతో ఆమెకు చికిత్సప్రారంభించారు:
CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities...TDS
పేషంటు మరే ఇతర నొప్పి నివారణలను తీసుకొనే పరిస్థతి లేదు కనుక కేవలం వైబ్రో మందులనే ఇవ్వడం ప్రారంభించారు. పది రోజుల తరువాత, ఆమె కుటుంబం అభ్యాసకురాలికి రోగికి నొప్పి తగ్గిపోయిందని తెలియచేసింది. ఆకలివేసినప్పుడు మెలుకువ వచ్చి కొంచెం ఆహారం తీసుకొని తర్వాత నిద్రపోయేదట. వైద్యులు ఆమె నొప్పి నుండి 100% నివారణ పొందినందుకు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆమె రెండు నెలల తరువాత 2016 జనవరి 15, న శాంతియుతంగా తనువు చాలించే వరకూ వైబ్రో రెమిడిలను కొనసాగింది. పేషంటు అంతిమ క్షణాలలో బాధ లేకుండా ప్రశాంతంగా తుది శ్వాశ వీడడానికి అవకాశం కల్పించిన వైబ్రియొనిక్స్ కు కుటుంబమంతా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.